582
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
నొంటిమెట్టచేరువను గానీ తుదకుఁ గడపమండలములో నెక్కడనై నను గాని లేదు. అందుచేత భాగవతమునందుఁ జెప్పఁబడిన యేకశిలానగరము నైజాము రాజ్యములోని యోరుగల్లే కాని కడపమండలములోని యొంటిమెట్ట కాదని యూహింపవచ్చును. భాగవతముద్రితపుస్తకములలో షష్ణస్కంధ మేర్చూరి సింగనయు, నేకాదక ద్వాదశస్కంధములు వెలిగందలనారయయుఁ దెలిఁ గించినట్లున్నది. సింగనగృహనామ మయిన యేర్చూరు గోలకొండ దేశము లోని నల్లగొండమండలములోను, నారయగృహనామ మయిన వెలిగందల కరీంనగరమండలములోను, రెండును బమ్మెరకు సమీపమున నిప్పటి నిజామురాజ్యములోనే యున్నవి. భాగవతము నాంధ్రీకరించిన పోతనా నాత్యునియొక్కయు, శిధిల మయిన షష్టస్కంధమును పూరించిన సింగన యొక్కయు, ఏకాదశ, ద్వాదశ స్కంధములను దెనిఁగించిన పోతన శిష్యుఁడైన నారయ యొక్కయు ఊళ్ళు మూఁడును పూర్వ మోరుగల్లు రాజధానిగా కర్ణాటరాజ్యములోనివే యగుట చేత పోతన చెప్పిన యేకశిలానగర మోరుగల్లే యని యించుమించుగా నిశ్చయింపవచ్చును. ఓరుగల్లప్పటి కర్ణాటరాజ్యములోనిది. కర్ణాట భాషలో "ఓరు” అనగా “ఒక్క" “కల్లు” ఆఁగా “రాయి" అని యర్థము ఒక రాయని యర్ద మిచ్చెడి ఓరుగల్లుకు సమానార్థక మయిన సంస్కృతపద మేకశిల. అందుచేత నేకశిలానగరమనఁగా నోరుగల్లుపుర మనుట స్పష్టము. ఒంటిమెట్ట యెప్పుడును నేకశిలా నగరము గాఁజాలదు. మెట్ట యనుదానికి శైల మర్థమగును గాన శిల యర్ధము కాదు. ఒంటిమెట్టయన్నచో నేక శైలగ్రామము కావచ్చును గాని యేకశిలానగరము గాదు. అది గాక యొంటిమెట్ట యొక చిన్న (గామమే గాని యేప్పుడును నోరుగంటివలె నగరమయినది కాదు. ఒంటిమెట్టకుఁ బూర్వకాలమునందుఁ గాని మఱి యేకాలమునందు గాని వ్యవహారమునందును గ్రంధములయందును గూడ నేకశిలానగరమన్న పేరు లేదు. ఇఁక నోరుగంటి కన్ననో భాగవతరచనముకుఁ బూర్వమునందు సహితము “రాజన్నేకశిలానగరాధీశ అని విద్యానాధుఁడు ప్రతాపరుద్రీయము నందు చెప్పినట్లుగా నేకశిలానగర వ్యవహార ముండినది. దీనిని బట్టి యేక