569
శ్రీనాథుఁడు
శా. రక్షోనాయకులార ! నిర్జరవర వ్రాతంబుచేతన్ సుధా
భిక్షాపాత్రము పోయె నంచు మదిలో బెగ్గిల్లఁగా నేటికిన్ ?
రక్షార్థంబు భజింప రాదె యభవుం ద్రైలోక్య కుక్షింభరున్
దాక్షారామపురాధినాధుని సుధాధామార్థచూడామణిన్ ?
గీ. పువ్వు ముడిచిన పురవీథిభూమియందుఁ
గట్టె మోవంగ వలసిన కారణమున
వీరభద్రునిచే దైన్యవృత్తి నొందె
దక్షుఁడట్టి మహాధ్వరస్థానమునను.
మ. జగతీమౌళి వతంసభూషణము విశ్వఖ్యాతము గాశికా
నగరంబుం బెడఁబాసి నీకును జగన్మాన్యేక చారిత్ర యీ
చిగురుంబోడికి నాకునుం గటకటా ! చేడ్పాటు వాటిల్లెనే
ముగురిం గూర్చిన ముండదైవమునకు న్మోమాట లేదే సుమీ !
శా. కాశీస్థాన నివాసులన్ యతుల భిక్షావృత్తులం గాంచి పా
రాశర్యుం డెటఁ బోయె నంచు నడుగన్ బ్రహ్మావిహీనాత్మకుం
డా శౌర్యుం డెటఁ బోయెనో యెఱుఁగమయ్యా మీరు పోపోండు వి
శ్వేశ ద్రోహి నెఱుంగ నేమిపని ? వాఁ డెచ్చోటికిం బోయెనో ?
3. కాశీ ఖండము
చ. కొసరి వసంతకాలమునఁ గోయిల క్రోల్చినభంగి నేడ్చే న
బ్బిసరుహనేత్ర కొండచఁఱి బెద్దయెలుంగున వెక్కి వెక్కి వె
క్కసమగు మన్యువేగమునఁ గాటుకకన్నులనీరు సోనలై
యుసిరికకాయలంతలు పయోధరముల్ దిగఁబాఱుచుండఁగన్.
ఉ. ఎట్టు పురాణము ల్పదియు నెమ్మిదిఁ జెప్పితి వెట్టు వేదముల్
గట్టితి వేర్పఱించి నుడికారముసొం పెసలార భారతం
బెట్టు రచించి తీవు ? ఋషి వె ట్టయి ? తొక్కదినంబు మాత్రలోఁ
బొట్టకు లేక తిట్టెదవు పుణ్యగుణంబులరాశిఁ గాశికన్