Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

566

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

శ్రీనాథుని వీథినాటక మని ప్రకటింపఁబడినదానికి వీధిరూపకలక్షణమేపట్టదు, వీధిలక్షణము ధనంజయవిరచితమైన దశరూపకము నందిట్లు చెప్పఁబడినది.

    శ్లో. వీధీ తు కైశికీ వృత్తా, సంధ్యంగాంకైస్తు భాణవత్,
        రస సూచ్య స్తు శృంగార స్పృశే దపి రసాంతరమ్
        యుక్తా ప్రస్తావనాఖ్యాతై రంగై రుద్ఘాత్యకాదిభిః,
        ఏవం విధి విధాతవ్యా ద్వ్యేకపాత్రప్రయోజితా.

దీనివలన వీధి కైశికీవృత్తియందు రచియింపఁబడి, భాణమునందువలె సంధ్యంగాంకములను గలదయి, అధికముగా శృంగారరసమును కొంచెముగా నితరరసములను గలిగి, ఉద్ఘా త్యకాద్యంగములతో ప్రస్తావనను గలిగి, పాత్రముల నొకటి రెంటిని గలదయి యుండవలెనని యేర్పడుచున్నది. విశ్వనాధవికృతమైన సాహిత్యదర్పణమునందు వీధిలక్షణ మీ క్రింది రీతిని వివరింపఁబడి యున్నది.

    శ్లో. వీథ్యా మేకో భవే దంకః కశ్చి దేకో౽త్ర కల్ప్యతే.
        ఆకాశ భాషితై రుక్తై శ్చిత్రాం ప్రత్యుక్తి మాశ్రితః
        సూచయే ద్భూరిశృంగారం కించి దన్యాన్ రసా నపి.
        ముఖనిర్వహణే సంధౌ అర్థప్రకృత యోఖిలాః
        అస్యా స్త్రయోదశాంగాని నిర్దిశంతి మనీషిణః,
        ఉద్ఘాత్యకావలగితే ప్రపంచ స్త్రిగతం ఛలమ్.
        వాక్కేళ్యధిబలే గండ మవస్యందిత నాళికే.
        అసత్ప్రలాప వ్యాహార మృదవాని చ తాని తు.

ఏకాంకసంయుత మయి, ఆకాశభాషితములచేత చిత్రప్రత్యుక్తులాడుపాత్రమును గల దయి; విస్తారముగా శృంగారమును కొంచెముగా నన్యరసములను ముఖనిర్వహణసంధులను గల దయి ఉద్ఘాత్యకము, అవలగీతము, ప్రపంచము, త్రిగతము, ఛలము, వాక్కేళి, అధిబలము, గండము, అవస్యందితము, నాళికము, అసత్ప్రలాపము, వ్యాహారము, మృదవము