పుట:Aandhrakavula-charitramu.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

563

శ్రీనాథుఁడు

ముదిరినతరువాత శివభక్తుడయి యుండెనని యీతఁడు రచియించిన గ్రంధములే సహస్రముఖముల ఘోషించుచున్నవి. ఆ కాలమునందు భ క్తికిని, నీతికిని నంతగా సంబంధ మున్నట్టు కనబడదు. ఒకఁడఖండ శివభక్తుఁడును గావచ్చును, జారశిరోమణి యయి యఖండ వేశ్యాభక్తుఁడును గావచ్చును.

ఇతఁడు మరుద్రాజుచరిత్రము, పండితారోధ్యచరిత్రము, శాలివాహనసప్తశతి, నైషధము, భీమపురాణము, కాశీఖండము. శివరాత్రిమాహాత్మ్యము, హర విలాసము, అను గ్రంధములను జేసెను, వీనిలో పండితారాధ్యచరిత్రమును వేమారెడ్డి సేనేనానాయకుఁడై న మామిడి ప్రెగ్గడయ్యకును, నైషధము నాతని తమ్ముఁడైన మంత్రి సింగనకును, భీమేశ్వరఖండమును వీరభద్రరెడ్డి మంత్రి యైన బెండపూడి యన్నయ్యకును, కాశీఖండమును వీరభద్రరెడ్డికినీ, అంకితము చేసెను.

శ్రీనాధుఁడు వీధినాటక మనబ డెడి యొక యపాత్రపు గ్రంథమును గూడఁ జేసెనని చెప్పుదురుగాని యిప్పుడు ప్రకటింపఁబడియున్న యా పేరిటి చిన్నపుస్తక మాతనిచే పుస్తకరూపమున రచియింపఁబడినది కాదు. అందు శ్రీనాథవిరచితములయిన పద్యములు కొన్ని యున్నవనుటకు సందేహము లేదు. కాశీఖండాది గ్రంథములలోని పద్యములను గొన్నింటిని శ్రీనాథుఁడు దేశసంచారము చేసినప్పు డక్కడక్కడఁ జెప్పిన పద్యములను గోన్ని టిని ఏర్చికూర్చి వానికిఁ దోడుగా నసము లయిన దుష్కవులు చెప్పిన బూతు పద్యములను జేర్చి వీధినాటకమను పేరు పెట్టి యేఁబది యఱువది పద్యములు గల చిన్న పుస్తకము నొకదానిని పలువురు ప్రకటించియున్నారు అందలీ పద్యములలో ననేకములు నీతిబాహ్యములుగాను, అసభ్యములు, నశ్లీలములు నగు నవాచ్యములుగాను ఉన్నవి. దుర్నీ తిపోషకములైన యీ యసుచిత పద్యరచనమును శ్రీనాధకవి కారోపించుట యాతని కపకీర్తి కలిగించుట.శ్రీనాధుడు తాను వీధినాటకమును జేసిన గ్రంధములోను జెప్పుకొనలేదు. శ్రీనాధుని భీమేశ్వరపురాణాదులవలన నతడఖండ శివపూజాధురంధరుఁడని తెలియవచ్చుచున్నది. అటువంటి శివభక్తాగ్రేసరుఁడు తన యిష్టదైవతము