పుట:Aandhrakavula-charitramu.pdf/588

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

561

శ్రీనాథుఁడు

వహించి బహుకాలము మహీపాలనము నిర్వహించి కడపట నా భారము నామె దౌహిత్రుఁడైన ప్రతాపరుద్రునియందుఁ బెట్టెననియు, చెప్పబడినది. వీరరుద్రమదేవి గణపతిదేవుని దుహిత యనియు, ఆ రుద్రమదేవి రాజ్యమును సుచరితుఁడైన దౌహిత్రునకుఁ ప్రతాపరుద్రున కిచ్చెననియు, ఈ శాసనము ఘోషించుచున్నది. కాకతి యనుదేవతదయచేత వొక గుమ్మడి తీగ కొక కుమారుఁడు కలిగెనఁట! ఆ గుమ్మడితీగకొడుకుయొక్క వంశము కాకతీయవంశ మయ్యెనఁట! గణపతిదేవ మహారాజాదులు తద్వంశ సంభవులట!

ప్రతాపరుద్రుని యంత్యదశలో యవనాక్రాంతమయిన యాంధ్రరాజ్యమును పోలయనాయకుఁ డుద్దరించె ననియు, ఆతనియనంతరమున కాపయనాయకుఁడు కొంతకాలము రాజ్యముచేసి కాలధర్మము నొందఁగా నాతనిని గొలుచుచుండిన డెబ్బదియైదుగురు నాయకులు త్రిలింగదేశమును తమలో విభజించుకొని వేఱు వేఱుభాగముల నేలుచుండిరనియు, వారితో పంటకులోద్భవుఁడయి పాతాళగంగకు సోపానములు కట్టించిన వేమారెడ్డి ప్రముఖుఁడనియు, చెప్పుట శాసనములోని యింకొక విశేషము. పోలయ యవనాక్రాంతమైన యాంధ్రదేశమును తురుష్కులచేతులలో నుండి యుద్దరించినట్టును, ఆతనియనంతరమునఁ గాపయనాయకుఁ డాంధ్రదేశరాజ్యమును వహించి నట్టును, దీనికిఁ బూర్వమునందుండిన యే శాసనములోను జెప్పబడలేదు. త్రిలింగదేశము యవనాక్రాంతమయిన సన్నిహిత కాలములయందు వ్రాయఁ బడిన యన్ని శాసనములును, పుస్తకములును తురుష్కులనుండి యాంధ్ర రాష్ట్రము నుద్ధరించినవాఁడు ప్రోలయవేముఁడనియు, ఆతఁడే శ్రీశైలమున పాతాళగంగకు సోపానములు కట్టించినవాఁడనియు, ఏకముఖముగా ఘోషించుచున్నవి నూట యిరువది సంవ్సరములకుఁ దరువాత {ప్రాయ వీడిన యీ శాసన ములోఁ ఊప్పింపబడిన యీ నూతనకధ విశ్వాసార్హ మయినదిగా కనఁబడదు. యవనులు త్రిలింగరాజ్యము నాక్రమించుట ప్రతాపరుద్రుని రాజ్యావసానదశలో 1320-వ సంవత్సర ప్రాంతముల