560
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
కలువచేఱు శాసనమువలనఁ దెలియవచ్చిన విశేషాంకములలో నొకటి యేక శిలానగరరాజ్యపరిపాలనము చేసిన రుద్రమదేవి గణపతిదేవుని దేవి గాక కూఁతురని స్థిరపడుట, 1260-వ సంవత్సరమువఱకును దేశపరిపాలనము చేసిన గణపతిదేవుని యనంతరమున నాతని రాజ్యమునకు వచ్చి 1261 మొదలుకొని 1265 వ సంవత్సరము వఱకును ప్రజారంజకముగా నోరు గంటిసామ్రాజ్యము నేలిన రుద్రమదేవి గణపతిదేవుని భార్య యని యేలాగుననో యొక వాడుక కలిగినది. తరువాతఁ గొంతకాలమున కామెమనుమఁడైన ప్రతాపరుద్రుని పైని విద్యానాధకవిచే- జెప్పబడిన ప్రతాపరుద్రీయము నకు మఱికొంత కాలమునకు వ్యాఖ్య చేసిన కుమారస్వామిసోమయాజి యెట్లో భ్రమపడి మూలవిరుద్ధముగా “పురా కిల కాకతికులసంభూతే, గణపతినామ్ని మహారాజే దుహితృమాత్రసంతానే కదాచిద్దైవయోగేన కాల పరిపాక ముపేయుషి తన్మహిషీ రుద్రదేవీ నామ రాజ్జీ బహూని వర్షాణి తద్రాజ్య మకంటకం పరిపాల్య పరిణతా సతీ దౌహిత్రే ప్రతాపరుద్రే రాజ్యధురాం నిదధే" అని పూర్వము కాకతీకులసంభూతుడైన గణపతిమహారాజు పుత్రికామాత్రసంతానము కలవాఁడయి దైవయోగముచేత కాలధర్మము నొందఁగా, నాతనిభార్య రుద్రమ దేవి బహుసంవత్సరము లా రాజ్యము నకంటకముగాఁ బరిపాలించి వృద్దురాలయి రాజ్యభారమును దౌహిత్రుఁడై న ప్రతాపరుద్రునియందుంచెనని వ్రాసెను. ఈ భ్రమ యెంతకాలమునకో వ్యాఖ్య చేసిన కుమారస్వామిసోమయాజికి మాత్రమే కాక రుద్రమదేవి రాజ్యకాలములోనే హిందూదేశ యాత్ర చేసిన మార్కోపోలో యను నిటలీ దేశీయునకును గలిగెను. అతఁడు తన యాత్రచరిత్రములలో రుద్రమదేవి వెనుకటిరాజురాణి యని వ్రాసెను. దీనిని జూచి తరువాతి చరిత్రకారు లనేకులు రుద్రమదేవిని గణపతిదేవుని దేవిని గాఁ జెప్పుచు వచ్చిరి. రుద్రమ దేవియొక్క వృద్ధదశలో నామె రాజ్యమునకువచ్చి యామె దౌహిత్రుఁడైన ప్రతాపరుద్రుని పైవి, జెప్పఁబడిన ప్రతాపరుద్రీయనామకాలంకారశాస్త్రములో గణపతిదేవుడు తనకు పుత్రిక కలుగఁగా నామెను పుత్ర ప్రతినిధిగా భావించి రుద్రనామము పెట్టననియు, తదనంతరమునం దామె రాజ్యభారముము