558
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
రాజమహేంద్రభూభువనరాజ్యరమారమణీమనోహరుం
డాజిఁ గిరీటి కీర్తి నిధి యల్లయవీరనరేంద్రుఁ డున్నతిన్.
మ. మనుతుల్యుం డగు కాటభూవరుని వేమక్ష్మాతలాధీశునం
దనఁ బాణి గ్రహణంబు చేసెఁ బ్రియమొందన్ వీరభద్రేశ్వరుం
డనితల్లిన్ వనితామతల్లి నుదయాస్తాద్రీంద్రసీమావనీ
ఘనసామ్రాజ్యసమర్థసుప్రథిమ సాక్షాదిందిరాదేవతన్.
గీ. అట్టి యనితల్లి పుణ్యగుణాభిరామ
దనకుఁ బట్టంఫుదేవిగా ధన్యలీల
వసుధ యెల్ల నేకాతపవారణముగ
నేలు నల్లయవీరభద్రేశ్వరుండు.
ఈ కవి యనితల్లి వలన రాజ్యప్రాప్తి యయిన కధను విడిచినను. కృతిపతి తన్ను గూర్చి చెప్పినను, తాను కృతిపతినిగూర్చి చెప్పినను దాక్షారామాప్సరసలను మాత్రము విడిచినవాడు కాఁడు.
శా. ఈ క్షోణి న్నినుఁబోలు సత్కవులు లే రీనేఁటికాలంబునన్
దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయగంధసారఘుసృణద్వైరాజ్యభారంబు న
ధ్యక్షించున్ గవిసార్వభౌమ ! భవదీయ ప్రౌఢసాహిత్యముల్.
శా. పారాపారపరీతవిశ్వవసుధాభారోత్థతీవ్రక్రియా
ధౌరంధర్య ! సరోరుహేక్షణ ! సమిద్గాండీవకోదండ ! దా
క్షారామప్రమదాకఠోరకుచకుంభాభోగసంకౢప్తక
స్తూరీస్థానకముద్రితస్థగితవక్షోవీథికాభ్యంతరా !
ఈ వీరభద్రారెడ్డి తన రాజ్యపరిపాలనకాలములో చుట్టుపట్ల నున్న కర్ణాటక కటకతురుష్కరాజులతో పరమమైత్రి కలిగినవాఁడయి యుండినట్టు ద్వితీ యాశ్వాసాంతమునందలి యీ క్రింది పద్యమువలన కనఁబడుచున్నది.