పుట:Aandhrakavula-charitramu.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

549

శ్రీనాథుఁడు

కకు భర్తయుఁ దనకు మంత్రియు నగు కాటయవేమభూపాలునకు రాజమహేంద్రవరము మొదలుగాఁ గల తూర్పుదేశము నిచ్చినట్టును, ఆ మల్లాంబ రాజమహేంద్రవరమున మార్కండేయ శివాలయమును గట్టించి శాలివాహనశకము 1333-వ సంవత్సరమునకు సరియైన క్రీస్తుశకము 1400 ఖరనామసంవత్సర కార్తికశుద్ధపూర్ణిమనాడు కోనసీమలోని మల్లవరమును నృసింహశాస్త్రికి దానము చేసినట్టును, తెలియవచ్చుచున్నది. భీమఖండము 143ం-వ సంవత్సరప్రాంతమునం దనఁగాఁ గవి కఱవది సంవత్సరములు దాటిన తరువాతనే చేయబడినది. ఈ గ్రంథరచనము చేసినతరువాతఁ గాని శ్రీనాధుఁడు తన కవిసార్వభౌమ బిరుదాంకాదికథలనంత బహిరంగముగాఁ జెప్పుకొన నారంభింపలేదు, భీమఖండము తుది గద్యమునందు "సుకవిజనవిధేయ సకలవిద్యాసనాధ శ్రీనాథనామధేయ ప్రణీతం" బని మాత్రమే వేసికొనియెను. తాను కవిసార్వభౌముఁడ నని భీమఖండములో మఱి యెక్కడను చేప్పుకొనలేదు, ఈ భీమేశ్వరపురాణ రచనముచేత శ్రీనాథునకు రాజాశ్రయము లభించి సంపూర్ణ మనోరథసిద్ది కలిగెను. అతఁ డప్పటినుండియు రాజానుగ్రహమునకుఁ బాత్రుఁడయి వేమవీరభద్రారెడ్ల యాస్థానకవి యయి మహాగౌరవపదము ననుభవింపఁ దొడఁగెను. తరువాత శీఘ్రకాలములో నే శ్రీనాధమహాకవి కాశీఖండమును తెనిఁగించి దానికి వీరభద్రారెడ్డిని కృతిపతిని జేసి రాజసమ్మానమును బడసెను. కాశీఖండము 1435-వ సంవత్సర ప్రాంతమునందు రచియింపఁబడియుండును. కవి కప్పటికి దాదాపుగా డెబ్బది సంవత్సరములప్రాయముండును. తన గ్రంథరచనమునుగూర్చి శ్రీనాధుఁడు కాశీఖండములో నిట్లు చెప్పుకొనెను--

              సీ. చిన్నారిపొన్నారి చిఱుతకూకటినాఁడు
                            రచియించితి మరుత్తరాట్చరిత్ర
                 నూనూఁగుమీసాల నూత్న యౌవనమున
                            శాలివాహనసప్తశతి నొడివితి