Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

545

శ్రీనాథుఁడు

    గీ. బ్రౌఢిఁ బరికింప సంస్కృతభాష యండ్రు
        పలుకునుడికారమున నాంధ్రభాష యందు
        రెవ్వ రేమన్న నండ్రుగా[1] కేమి కొఱఁత ?
        నాకవిత్వంబు నీజము కర్ణాటభాష !

ఈ కడపటి పద్యములోనివి. త న్నితరు లాక్షేపించునప్పుడు సమాధానముగాఁ జెప్పఁ బడిన పరిహాసగర్పీతములైన మాటలేకానీ తన కవిత్వము కర్ణాటభాష యని శ్రీనాథుని యభిప్రాయ మెంతమాత్రమును గాదు.[2] ఇట్లన్యాపదేశముగా దూషించుటయే కాక రాజమహేంద్రవండితులను శ్రీనాథుఁడు బహుపద్యములయం దాక్షేపించి యున్నాఁడు:

    శా. .............................................
        ..........................................వి.
        ద్వాంసుల్ రాజమహేంద్రపట్టణమునన్ ధర్మాసనంబుండి ప్ర
        ధ్వంసాభావము ప్రాగభావము మనుచుం దరింతు రశ్రాంతమున్.

    మ. శ్రుతిశాస్త్రస్మృతు లభ్యసించుకొని విప్రుం డంత నానాధ్వర
        వ్రతుడై పోయి కనున్ బురందరపురారామద్రుమానల్పక
        ల్పతరుప్రాంతలతాకుడుంగసుఖసుప్తప్రాప్తరంభాంగనా
        ప్రతిరోమాంకురపాటనక్రమకళాపాండిత్య శౌండీర్యముల్.

     వ. “కీర్తివిహారఘంటాపధం బైన పంటమహాన్వయంబునఁ బాఁకనాటి
         దేశంబున భద్రపీఠంబున నధివసించిన -------- పోలయ వే

  1. నాకేమి - అని పాఠాంతరము
  2. [శ్రీ నాధుఁడు తన కవిత్వము సంస్కృతము, తెలుగు కాదు: కర్ణాటభాషయని యా క్షేపణరూపముగఁ జెప్పినను 'చెవికింపఁగు మధుర మైన భాష (కర్ణ+అట+భాష)' యని సూచించెననుట స్పష్టము. ఎవ్వరేమన్న నండ్రుగాకేమికొఱఁత? అనునదియు పయి యర్థమును సమర్థింపఁగలదు]