పుట:Aandhrakavula-charitramu.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

540

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

        “వేదండవదనశుండాకాండచుళికితోన్ముక్తసప్త
         గోదావరసలిలధారాఝుణత్కారబృంహిత
         బ్రహ్మాండగోళంబు”

అనియు,

    శ్లో. సత్సమాగమమన్నామకథాశ్రవణ యోగతః,
         పాపక్షయో భవేద్దేవి ! మనుష్యాణాం కలౌ యుగే

(దేవీ ! సత్సమాగమమువలనను. నా నామకథాశ్రవణమువలనను కలియుగమునందు మనుష్యులకు పాపక్షయ మగును) అనుదానిని

       “పాపంబు లొకభంగిఁ బ్రక్షయం బందిన
        నామీఁద దృఢభక్తి నాఁటుకొనును”

అనియు, మూలమునకు భిన్నముగా భాషాంతరీకరించుటయే కాక యొకానొక చోట “సమర్థ స్స హి దేవరాట్' అనుదానిని “సంతతము దేవవేశ్యా భుజంగుఁడతఁడు అన్నట్లు సభ్యముగానున్న దాని నసభ్యముగాను తెనిఁగించుచు వచ్చి యున్నాఁడు. ఈ కడపటిదానిమూలమును. దాని భాషాంతరమును జూడుఁడు.

    శ్లో. కాలకూటోపసంహారీ, త్రిపురాసురమర్దనః,
       నిగ్రహానుగ్రహప్రౌఢః సమర్ద స్స హి దేవరాట్.

    గీ. కాలకూటోపసంహారకారి యతఁడు
       త్రిపుర దై త్యాధిపతుల మర్దించె నతడు
       నిగ్రహానుగ్రహప్రౌఢనిపుణుఁ డతఁడు
       సంతతము దేవవేశ్యాభుజంగుఁ డతఁడు.

“దృఢసమర్థుండు చూ దేవదేవుఁ డతడు” అను రీతి నేదో యొక విధముగా మూలానుసారముగాఁ దెనిఁగింపక దేవతావర్ణనలోఁగూడ స్వకపోలకల్పిత