Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

525

శ్రీనాథుఁడు

సాళువ సంబురాయని కొడుకగు తెలుంగురాయని యాశ్రయ మేర్చడినది. ఈతని శాసనము శక 1350 నాఁటీ దొకటి సింహాచలముమీఁదఁ గలదు.

........నెల్లూరు మండలముననే యాత్మకూరు తాలూకాలోఁ దెలుంగురాయని పురమను గ్రామము గలదు. అది యీ తెలుంగురాయని పేర నేర్పడినదే కావచ్చును. కృష్ణాతీరమున శ్రీకాకుళ గ్రామముతోఁ జేరి తెలుఁగురాయని పాలెమను పల్లె యొకటికలదు. కాని, యది శ్రీకాకుళంధ్రనాయకస్వామి పేర నేర్పడినదికాని, యీ తెలుఁగురాయనికి సంబంధించినది కాదు. ఈతని కీ నామము గూడ నా శ్రీకాకుళాంధ్రనాయకుని పేరునుబట్టి వచ్చినదే యగునని నేను తలంచుచున్నాఁడను. ఆ కాలమున నీ తెలుగు రాయలను పేరు పలువురు పెట్టుకొనుచు వచ్చిరి. శ్రీకాకుళాంధ్రనాయక స్వామి యుత్సవాదులప్పుడు ప్రఖ్యాతముగాజరుగుచుండెడివి. శ్రీకాకుళాంధ్ర నాయకస్వామికిఁ దెలుఁగు రాయఁ డని కూడఁ బేరుండుట తెలియక కొందరీ సంబురాయనికొడుకు తెలుంగురాయఁడు శ్రీకాకుళమునేలినరాజని వ్రాసిరి. ఈ తెలుంగురాయఁడు (శ్రీకాకుళమునేలినవాఁ డనుటకు నాధారము మేమియుఁ గానరాదు. అట్లుంట ప్రామాదికమే ! ఈ తెలుంగురాయఁడు రాజ్యమెక్కడయేలెనో ప్రఖ్యాతముగాలేదు. విద్యానగరాధీశ్వరుని క్రింద సేనానాయకుడుగా నుండినట్టున్నాఁడు. బాపట్ల తాలూకా నూతులపాడు గ్రామమున నీ తెలుఁగురాయని పుత్త్రుఁడు తిరుమలరాయని శాసనములు శా. 1466 నాఁటివి కలవు. తెలుఁగురాయని తండ్రియగు సంబురాయఁడు శా. 1348 నను, నాతని కొడుకగు తిరుమలరాయనీ ళాసనము శా. క. 1466 నను నుండుటచేఁ దెలుఁగు రాయఁడు శా 1348 తర్వాత 1395 దాక నున్నట్లును, సింహాచలశాసనము నాఁటి కాతఁ డిర్వది యేండ్లకులోపడిన వయస్సువాఁడయినట్లును తలఁపఁ దగును. అతఁ డిప్పటికిఁ బ్రఖ్యాతుఁడుగాక, తండ్రిచాటువాఁ డగుటచేతనే యా శాసనమందు 'కన్నడ దేశమందలి సంబురాయని కొడుకు తెలుగు రాయండు' అని పేర్కొనవలసెను. ఆతని శాసనము శా. 1364 నాఁటిది నూతులపాడు గ్రామమునందున్నది.