పుట:Aandhrakavula-charitramu.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

524

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

" స్వస్తిశ్రీ శకవర్షంబులు 1350 అగు నేఁటి ప్లవసంవత్సరఫాల్గుణకృష్ణ 7 గురువారానను కన్నడ దేసమందుల సంబరాయనికొడ్కు తెలుంగురాయండుతనకు అభీష్టార్థసిద్దిగాను శ్రీనరసింగనాధునికీ నిత్యమును సన్నిధిని వెలుంగను అఖండదీపాలు రెండు సమర్పించెను"

శ్రీనాధుఁ డీతనిని 1425-వ సంవత్సర ప్రాంతమునందు దర్శనము చేసి యుండును ఈతని రాజ్యప్రదేశ మేదో సరిగా తెలిసినది కాదు: గాని

           శా. ధాటీ ఘోటకరత్న ఘట్టనమిళద్రాఘిష్ఠకళ్యాణఘం
               టాటంకారవిలు రలుంఠితమహోన్మత్తాహిక్షోణిభృ
               త్కోటీరాంకితకుంభినీధరసముత్కూటాటవీఝాటక
               ర్ణాటాంధ్రాధిపసాంపరాయని తెలుంగా ! నీకు బ్రహ్మాయువౌ

అను శ్రీనాధుని పద్యమునుబట్టి చూడఁగా కర్ణాటాంధ్రదేశమధ్యస్థమయిన యేదో యరణ్య ప్రాంతరాజ్య మయినట్టు కనిపట్టుచున్నది. ఈ తెలుఁగు రాయఁడు కవులకు కస్తూరిదానము చేయుటలోఁ బ్రసిద్ధుఁడు. శ్రీ నాధుని యీ క్రిందిపద్య మీ యంశమును తెలుపుచున్నది.

           శా. అక్షయ్యం బగు సాంపరాయనితెనుంగాధీశ కస్తూరికా
               భిక్షాదానము చేయురా సుకవిరాడ్బృందారకస్వామికిన్
               దాక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
               వక్షోజద్వయకుంభికుంభముల పై వాసించు దద్వాసనల్.

శ్రీనాధకవీంద్రుఁ డీ పద్యములు జెప్పునప్పటి తాను దాక్షారామమునకుఁ బోవ నుద్దేశించుకొన్నట్టు కనుపట్టుచున్నది [శ్రీనాధునిచేఁ ప్రస్తుతింపఁబడిన తెలుఁగురాయనిఁగూర్చి శ్రీ ప్రభాకరశాస్త్రులు గారి 'శృంగార శ్రీనాధము'న నిట్లున్నది.

"భీమఖండరచనము తర్వాత, దాక్షారామసమాయోగము గల్గినయాపయి (క్రీ. 1435-1440 ప్రాంతమున మన శ్రీనాధునకు మేదినీమీసరగండకటారి