పుట:Aandhrakavula-charitramu.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

514

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

ఎవరి యనుగ్రహమువలననైన నేమి ? శ్రీనాధునకు రాయల సందర్శన లాభము కలుగుటయేకాక తదాస్థానమునందు విపక్షవిద్వాంస విజయలాభమును, తద్బిరుదాంకసంపాదనలాభమును, కనకాభిషేకలాభమును గూడఁ గలిగినవి. లాభములు రాఁదొడఁగినప్పుడు లాభములమీఁదనే లాభములు వచ్చును గదా ! రాయల సంస్థానమునందు శ్రీనాధ మహాకవికి తదాస్థాన విద్వాంసుఁడగు డిండిమకవిసార్వభౌమ బిరుదాంకితునితో నుద్భట వివాద మొకటి సంప్రాప్త మయ్యెను. మహారాజాశ్రయము గల యా విద్వాంసుఁడు స్వవిజయనిశ్చయహంకారముచేతను, విద్యాగర్వముచేతను దన్నాతడోడించినయెడల తన విజయడిండిమమును బగులగొట్టించుకొని తన కవి సార్వభౌను బిరుదము నిచ్చి వేయుదునని పంతములు పలికి యుండును. తానొకటి తలఁచిన దైవ మొకటి తలఁచును గదా ! వివాద మే విషయము లోనో దెలియదు గాని యిరువురకును నడచిన యుద్భటవివాదములో శ్రీవాణీ ప్రసాదలబ్ధసకలవిద్యా సనాధుఁ డగు శ్రీనాధుఁడే విజయమునొంది యా గౌడడిండిమభట్టు కంచుఢక్కను బగులఁగొట్టించి యాతని కవిసార్వభౌమ బిరుదమును లాగుకొన సమర్థుఁ డయ్యెను. ఈ కవిసార్వభౌమ బిరుదసమార్జనమునకు మన కవిరాజునకు చంద్రశేఖరు క్రియాశక్తి తోడయినట్టు చెప్పుదురు "చంద్ర శేఖరు క్రియాశక్తి రాయలయొద్దఁ బాదుకొల్పితి సార్వభౌమ బిరుద” మని శ్రీనాధుఁడే పయి సీసపద్యపాతమునందుఁ జెప్పెను. "శ్రీనాధుఁడు సాళ్వగుండ నరసింహరాయల కాలములో నుండినట్లును, తదాస్థానమునకుం బోయి డిండిమభట్టు నోడఁగొట్టినట్టును తెలియుచున్నది. గోకఁ జుట్టితి............తల్లీ ! కన్నడరాజ్యలక్ష్మి ! దయలేదా నేను శ్రీనాధుఁడన్' అని చెప్పినది నరసింగరాయల యాస్థానమునందే ! డిండిమ కవిని శ్రీనాధుఁ డోడించెను గదా ! 'పగుల గొట్టించి తుద్భట వివాద ప్రౌఢి గౌడడిండిమభట్టుకంచుఢక్క' అనునది నిక్కమే. ఈ డిండిముఁడే జైమిని భారతముఁ గృతినందిన సాళ్వగుండ నరసింహరాజు విజయములను వర్ణించుచు సాళువాభ్యుదయ మను సంస్కృతకావ్యమును రచించెను. --------------------------------చంద్ర శేఖరుఁ డను