27
న న్న య భ ట్టు
11. విజయాదిత్యుఁడు - ఇతఁడు నాల్గవ విష్ణువర్ధనుని కొడుకు; విజయాదిత్యుని మనుమఁడు. ఈ రెండవ విజయాదిత్యుఁడు నరేంద్రమృగరాజనియు, సమస్త భువనాశ్రయుఁడనియు, చాళుక్యార్జునుఁడనియు బిరుదు పేరులు వహించి, 799 మొదలు 843 వఱకును నలువదినాలుగు సంవత్సరములు రాజ్యపాలనము చేసెను ఇతఁడు గాంగులతోను రాష్ట్రకూటులతోను బహు యుద్దములు చేసి వారిని జయించి, తన రాష్ట్రమునందు నూటయెనిమిది శివాలయములు గట్టించెను
12. విష్ణువర్ధనుఁడు - ఈ యైదవ విష్ణవర్షనుఁడు విజయాదిత్యుని కొడుకు. సర్వలోకాశ్రయుఁడు, విషయసిద్ధి యను బిరుదాంకములను గలవాఁడు.ఇతఁడు 843 మొదలు 844 వఱకు పదునెనిమిదినెలలు రాజ్యము చేసెను. ♦[1] ఈతని కాలమునఁ బుట్టిన శాసనములలోఁ గొంతభాగము తెలుఁగు భాషలో నున్నది.
13. విజయాదిత్యుఁడు - ఈ మూడవ విజయాదిత్యుఁడు (ఐదవ) విష్ణువర్ధనుని పెద్దకొడుకు. ఇతఁడు గణితశాస్త్రమునందు పండితుఁ డగుటచేత గణకవిజయాదిత్యుఁడని పిలువఁబడుచు వచ్చెను. *[2] ఇతఁడు రాష్ట్రకూటులను జయించి, మంగిరాజు శిరస్సు ఖండించి,844 మొదలు 888 వఱకు నలువదినాలుగు సంవత్సరములు ప్రజాపరిపాలనము చేసెను -ఈతనికి యుజరాజవిక్రమాదిత్యుఁ డనియు, యుద్ధమల్లు డనియు నిద్దఱు తమ్ములుండిరి.
14. చాళుక్యభీముఁడు - ఇతఁడు యువరాజవిక్రమాదిత్యుని కొమారుఁడు. ఇతఁడు తన పెద్దతండ్రియైన విజయాదిత్యుని పిమ్మట రాజ్యమునకు వచ్చి రాష్ట్రకూటరాజయిన రెండవ కృష్ణుని జయించి యావఱ కన్యాక్రాంతమైన