512
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
వలసినవాఁడయ్యెను. ఆ సమయములో విసుగుచెంది కవిచెప్పిన పద్య మును చూడుcడు.
శా. కుళ్ళా పెట్టితిఁ గోక చుట్టితి మహాకూర్పాసమం దొడ్గితిన్
వెల్లుల్లి దిలపిష్టము న్మెసవితిన్ విశ్వస్త వడ్డింపగాఁ
జల్లా యంబలి ద్రావితిన్ రుచుల దోసం బంచుఁ బో నాడితిన్
దల్లీ ! కన్నడరాజ్యలక్ష్మి ! దయలేదా ? నేను శ్రీనాథుఁడన్.
పయి పద్యములో "తల్లీ ! కన్నడరాజ్యలక్ష్మి " యని కర్ణాటక దేశము సంబోధింపఁబడి యుండుటనుబట్టి శ్రీనాధుఁడు కర్ణాట దేశస్థుఁడని యొకానొకరు విషయవిచారము చేయక వ్రాసిరి; గాని యది గ్రాహ్యము కాదు. శ్రీనాధు డెప్పుడును దాను పాకనాఁటి సీమవాఁడ [1] ననియు, కొండవీటివాసుఁడ ననియు, జెప్పుకొనుచుండెను. కర్ణాటక రాజధానియందు రాజసందర్శనము కాకముందో, ప్రధమసందర్శన సమయమునందో మీ వాసస్థల మేది ? యని యడుగఁగా శ్రీనాథుఁడు కొండవీడని యీ క్రింది పద్యముతోఁ జెప్పినట్టు చెప్పుదురు.
"సీ. పరరాజ్యపరదుర్గపరవై భవశ్రీలఁ
గొనకొని విడనాడు కొండవీడు
పరిపంధిరాజన్యబలముల బంధించు
కొమరు మించినబోడు కొండవీడు
ముగురురాజులకును మోహంబు పట్టించు
గుఱుతైన యుఱిత్రాడు కొండవీడు
చటులవిక్రమకళాసాహసం బొనరించు
కుటిలాత్ములకుఁ గాడు కొండవీడు
- ↑ [శ్రీనాథుడు పాకనాఁటింటివాఁడు కాని, పాకనాటిసీమవాఁడు కాఁడని విమర్శకుల యభిప్రాయము.]