Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

510

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

వ. అనవుడు నమ్మహీసురాగ్రగణ్యుండు కమలనాభామాత్యపౌత్రుండు మారయామాత్యపుత్రుండు శ్రీనాథకవివరేణ్యుండు సంతుష్ట మానసుండై శాంతస్వామి యొసంగిన కర్పూరతాంబూలజాంబూనదా భరణంబుల నంగీకరించి స్కాందపురాణంబున సీశానసంహితఁ .... జెప్పంబడ్డ . శివరాత్రిమాహాత్మ్యంబు.........."

* * * *

      
       క. వరముమ్మయశాంతునకున్
          బరమపరజ్ఞాననిధికిఁ భావనమతికిన్
          నిరుపమ విక్రమయశునకుఁ
          గరుణారసపూరితాత్మకవితాంగునకున్.

వ. అభ్యుదయపరంపరాభివృద్దియు సత్యధర్మక్రియావృద్దియు నగునట్లష్ణాదశ వర్ణనాగర్భంబుగా నత్యాశ్చర్యకరంబై యుండ నా రచియింపంబూనిన కధానిధానంబు --- - నా నేర్చిన విధంబున రచియించెద".

అని శ్రీనాధుఁడు గ్రాంధావతారికయందుఁ జెప్పెను. ఆ వఱకుఁ దాను గోమటివేమనృపాలుని జీవితకాలములోనే రచియించుచుండిన గ్రంథమునే యవశిష్టమును ముగించి యవతారికను వ్రాసి యాశ్వాసాద్యంత పద్యములను జేసి శ్రీశైలయాత్రాసమయమునం దర్హసంభావనమును బడసి శ్రీనాధుఁడీ శివరాత్రిమాహాత్మ్యమహాకావ్యమును మహాధనసంపన్నుఁడైన ముమ్మడి శాంతయ్య కంకిత మొనర్చినట్లు తోఁచుచున్నది. ఈ గ్రంథము 1424 సంవత్సర ప్రాంతమునందు సంపూర్తి చేయఁబడి యుండును.

ఇట్లు శ్రీశైలయాత్ర వలన తీర్థమును స్వార్ధమును గలిసి వచ్చి యభిమతార్థ సిద్ధి యయినతరువాత శ్రీనాధుఁ డక్కడనుండి వెలువడి ధనాగమసమ్మాన సముపార్జనార్థమయి స్థలాంతరాన్వేషణము చేసికొనవలసినవాఁ డయ్యెను.