Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

502

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

గానబడుచున్నది. పొన్నుపల్లి గ్రామము గుంటూరు మండలమునందలి రేపల్లెతాలూకాలోనిది. ఈ శాసనములోని మొదటి పది శ్లోకములను సరిగా ఇలపాడు శాసనములో నుండినవే.

        శ్లో. యత్కీర్తిగానసమయే ఫణిసుందరీణా
            మాలోకితం చ ముఖరాగ మనంగమూలం,
            శ్రోతుం చ గీతరచనాం యుగప న్న దక్షో
            నాగాధిపో న సహతే నయన శ్రుతిత్వం. 11

అను పదునొకండవ శ్లోకము క్రొత్తది. పండ్రెండవ శ్లోకము వెనుకటి శాసనములో నుండినదే. దాని తరువాతి శ్లోకములు ప్రత్యేకముగా నీ శాసనముతో సంబంధించినవి.

        శ్లో. సో౽యం వేమమహీపాలో భూపాలపరమేశ్వరః,
           భూదానవీరమూర్ధన్యో ధీరోదాత్తగుణోత్తరః. 12

           ఖరామరామేందుమితే శాకాబ్దే సర్వధారిణే,
           ఉపరక్తే సహస్రాంశౌ మానే చాశ్వయుజాహ్వయే. 13

           నప్త్రే శ్రీ పేర్య పేళ్ళస్య కళ్యాణగుణశాలినః
           అకర్తృకాణాం సాంగానాం మధ్యానాం వచసా న్నిధేః 14

           శ్రీభట్టభాస్కరార్యస్య పౌత్రాయ బ్రహ్మవాదినే,
           అష్టాదశానాం విద్యానాం మధ్వన్యస్య మహావసోః 15

           పుత్రాయ విర్లయార్యస్య వేదవేదాంగవేదినః
           ఆయుర్వేదం చ సాష్టాంంగ నిర్నిరోధమధీతినః. 16
 
           ఫణిరాజమహాభాష్యఫక్కికాపరమేష్టినే,
           కర్మబ్రహ్మపరామర్శ మీమాంసామాంసలాత్కనే 17