Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

501

శ్రీనాథుఁడు

       భూదానవీరమూర్ధన్యో ధీరోదాత్తగుణోత్తరః 11

        శ్రీశాకాబ్దే పయోరాశిరామరామేందుసమ్మితే
        నందనే మాసి మాఘాఖ్యే శివరాత్య్రాం రవిగ్రహే 12

        పితః పితామహో యస్య మహనీయయశోనిధిః,
        మాధవో నామ మేధావీ విశ్వవిద్యావిహారభూః 13

        పితామహో మహావిద్వాన్ యస్య శ్రీగుండయాభిదః,
        వేదాదీనాం విశుద్దానాం విద్యానాం జన్మమందిరం. 14

        శాపానుగ్రహదక్షో లక్ష్మీనరసింహమంత్రసంసిద్ధః,
        సకలకవిసార్వభౌమో మాధవభట్టః పితా యస్య 15

        శ్రీవిశ్వేశ్వరవిదుషే భారద్వాజాన్వయావతంసాయ,
        స్మయవిరహితాయ తస్మై విద్యావినయాన్వితాయ పుణ్యాయ. 16

        ప్రదా త్త్రిలింగవిషయే వెలనాcడౌ మనోరమే,
        తుంగభద్రాతరంగిణ్యాs ప్రాక్తీరే పర్యవస్థితం. 17

        ఆలపాడు రితి ఖ్యాతం గ్రామ మాచంద్రతారకం,
        సాష్టైశ్వర్యం హృష్టభోగం ధారాపూర్వం ధరాధిపః. 18

ఈదానశాసనము శాలివాహనశకము 1335 నందనసంవత్సర మాఘమాసము శివరాత్రినాఁ డనఁగా 1413-వ సంవత్సరము జనేవరు నెల 31 వ తేదీని భారద్వాజగోత్రుఁ డైన విశ్వేశ్వర పండితునకు వెలనాటిసీమలో తుంగభదా తీరమునందుండిన యాలపాడు గ్రామము నగ్రహారముగా నిచ్చిన సందర్భమున వ్రాయబడినది. పయి మూఁడు శాసనములను గాక శ్రీనాథవిరచిత మయినది పొన్నుపల్లి శాసనమనఁబడెడి యింకొక తామ్రశాసనము కూడఁ