పుట:Aandhrakavula-charitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25

నన్నయ భట్టు

కుబ్జవిష్ణువర్ధనుకును తత్పూర్వులకును రణాధిదేవత యయి షాణ్మాతురుఁడయిన కార్తికేయుఁడు (కుమారస్వామి)ను, ఆదిశక్తులైన మాతృకలును, కులదైవతము లయినట్టును, తత్కులమువారు వారిచే రక్షింపఁబడుచుండునట్టును 616 వ సంవత్సరమునందుఁ జేయఁబడిన సతారా దానశాసనము చెప్పుచున్నది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇందాణి, చాముండ -సప్తమాతృకలు,

2. జయసింహుఁడు-విష్ణువర్షనుని జ్యేష్టపుత్రుఁడయిన (మొదటి) జయసింహుఁడు 633 వ సంవత్సరము మొదలుకొని 663 వ సంవత్సరము వఱకును ముప్పది యేండ్లు రాజ్యము చేసెను. ఇతనికి సర్వసిద్ధి యను బిరుదనామము కలదు. ఇతఁడు గుడివాడ తాలూకాలో పెణుకపఱ్ఱు గ్రామము నొక బాహ్మణుని కిచ్చినట్లు దానశాసనమున్నందున, ఇతని రాజ్యము నెల్లూరిమండలము వఱకును వ్యాపించి యుండెను

3. ఇంద్రభట్టారకుcడు— ఇతఁడు కుబ్జవిష్ణువర్ధనుని ద్వితీయ పుత్రుఁడు; జయసింహుని తమ్ముఁడు. ఈ యింద్రరాజు 663 వ సంవత్సరములో నేడుదినములు మాత్రమే రాజ్యము చేసి మృతుఁడయ్యెను.

4· విష్ణువర్ధనుఁడు- ఇతఁ డింద్రభట్టారకుని కొడుకు. ఇతనికి సర్వలోకాశ్రయుఁ డనియు విషమసిద్ది యనియు బిరుదు పేళ్ళు గలవు. ఇతఁడు 664 వ సంవత్సరము మొదలుకొని 672 వ సంవత్సరము వరకుసు తొమ్మిది సంవత్సరములు రాజ్యము చేసెను. ఇతcడు చేసిన యొక దాన శాసనమునందు "ఆత్మనో విజయరాజ్యపంచమే సంవత్సరే ఫాల్గుణ మాసే అమావాస్యాయాం సూర్యగ్రహణ నిమిత్తం" అని శకసంపత్సరము 590 ఫాల్గుణ బహుళామావాస్యకు సరియైన 668 వ సంవత్సరముతేదీ ఫిబ్రవరి నెల 17వ తేదీ యితనిరాజ్యములో నైదవయేడని చెప్పఁబడి యుండుటచేత, ఈతనిరాజ్యము 664 వ సంవత్సరము ఫాల్గుణ బహుళములో నారంభ మయినట్టు తోఁచుచున్నది.