పుట:Aandhrakavula-charitramu.pdf/513

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

486

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యీ పద్యము తిప్పయసెట్టికూడ ప్రోలయవేమారెడ్డి కాలములోనుండినట్టు తెలుపుచున్నది.

               క. శ్రీపర్వతసోపాన
                   స్థాపక మేమక్షితీశసామ్రాజ్యశ్రీ
                   వ్యాపారిముఖ్య ! యన్వయ
                   దీపక ! యలకాధిరాజ ! దేవయతిప్పా!

ప్రోలయవేమారెడ్డికాలములోనే తిప్పయ్య సెట్టి వ్యాపారిముఖ్యుఁడయినందున నప్పటి కిరువది సంవత్సరములవాఁడయినయి యుండి, కుమారగిరిరెడ్డి రాజ్యారంభకాలమునకే యేఁబది సంవత్సరమలవాఁడయి, హరవిలాసరచన కాలమునకే యఱువదేండ్లు దాటినవాఁడయి యుండవలెను. హరవిలాసము 1440 -వ సంవత్సర ప్రాంతమున తిప్పయసెట్టి కంకితము చేయఁబడినదని చెప్పెడి బుద్ధిమంతుల యభిప్రాయ ప్రకారము తిప్పయసెట్టికి నూటపది యేండ్ల దాఁటినతరువాత శ్రీనాధుఁడు హరవిలాసము నంకితము చేసెనని యేర్పడును గనుక సది గొప్ప యసంగతము. కాబట్టి హరవిలాసము కుమారగిరిభూపాలుఁడు జీవించియుండఁగానే 1360-వ సంవత్సరమునకు లోపలనే తిప్పయనెట్టి కంకితము చేయఁబడుట నిశ్చయము. అప్పటికే తిప్పయసెట్టికి దాదాపుగా డెబ్పదిసంవత్సరములయీడుండును.1360-వ స వత్సరమునకు లోపల జనన మొందని శ్రీనాధుఁడు వృద్ధుఁ డై న తిప్పయ సెట్టికి బాలసఖు డెట్లగును ? ఇద్దఱును సమానవయస్కులు కాకపోవుట నిశ్చయము. తిప్పయనెట్టి వృద్దుఁడే ! శ్రీనాధుఁడు బాలుఁడయి యుండినప్పుడు సఖ్యము కలుగుటచేతనే తిప్పయసెట్టికి శ్రీనాథుఁడు బాలసఖుఁ డయ్యెను గాని యుభయులును బాలురయి యుండినప్పడు కలిగిన మైత్రి చేతఁ గాదు, పయి సీసపద్యములో

                   "ఆంధ్రభాషానైషధాబ్జ భవువి"

అని యున్నందున, హరవిలాసము నైషధమునకుఁ దరువాత రచింపఁబడె ననుటకు సందేహము లేదు ఇఁక హరవిలాసమును రచించిన కాలమును