పుట:Aandhrakavula-charitramu.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

485

శ్రీనాథుఁడు

           నుభయభాషాకవిత్వ ప్రయోగ కుశలు
            బాలసఖు గారవించి తాత్పర్య మొప్ప
            నవచిదేవయత్రిపురారి యక్షరాజు
            హితమితోక్తులు వెలయంగ నిట్టులనియె.


        క. కంటినీ విశుద్దసంతతి
            వింటిఁ బురాణములు పెక్కు విశ్వము పొగడన్
            మంటి బహువత్సరంబులు
            గొంటి యశోధనము సుకవికోటి నుతింపన్ [ పీఠిక-9.9]

              ... .... ... ..... ......

        గీ. ఆగమజ్ఞాననిధివి తత్త్వార్థనిధి
           బహుపురాణజ్ఞుఁడవు ......
           బాలసఖుఁడవు శైవ ప్రబంధమొకటి
           అవధరింపుము నా పేర నంకితముగ [ పీఠిక -12 ]

పయి వాక్యమువలన తిప్పయ్యసెట్టిపై కొమరగిరినృపాలునకు కస్తూరీఘన సారాదులు సమకూర్చువాఁడయినట్టును. ఏండ్లు చెల్లినవాఁ డయి నట్టును కవిబాలసఖుఁ డయినట్టును కనుపట్టుచున్న ది ఇందలి మొదటి రెండంశముల విషయములోను సందేహము లేదు తిప్పయ సెట్టి తండ్రి దేవయ్య సెట్టి 1320 మొదలుకొని 1340 వఱకును రాజ్యము చేసిన ప్రోలయవేమారెడ్డికాలములో నుండినవాఁ డగుటచేతను, ప్రోలయ వేమారెడ్డికొడుకు కొడు కైన కొమరగిరి రెడ్డికాలములో తిప్పయసెట్టి యుండుటచేతను, తిప్పయసెట్టి కుమారగిరిభూపాలుని తండ్రి యైన యనపోతభూపాలునియీడువాఁ డయి యుండవలెను. అప్పుడు తిప్పయసెట్టికుమారులే కొమరగిరి రెడ్డి యీడువారయి యుండవలెను. అందుచేత తిప్పయసెట్టి కప్పటి కఱువది సంవత్సరముల వయస్సుండి యుండవలెను. అంతేకాక తృతీయాశ్వాసారంభములోని