Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

476

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

తరమున నాతని తమ్ముఁడు పెద్దకోమటి రా జయ్యెను, ఇతఁ డనవేమభూపాలవి రాజ్యకాలములోనే మృతినొందఁగా ననవేమభూపాలుని చివర దినములలోనే పెద్దకోమటివేమభూపాలుఁడు తన తండ్రి రాజ్యమునకు వచ్చెను. అనవేమభూపాలునకు మామిడి సింగన్నతండ్రి పెద్దనామాత్యుఁడు మంత్రిగా నుండినట్టును, వేమభూపాలనకు పెద్దనామాత్యుని తమ్ముఁడై న నామామాత్యుఁడు మంత్రిగా నుండినట్టును, శ్రీనాధుని శృంగార నైషధములో నున్న రెండు పద్యములును పయి నింతకుముందే యుదాహరింపబడెను.

కుమారగిరిరాజ్యకాలమునందే హేతువుచేతనో తండ్రి యనంతరమున మంత్రిత్వము లభింపకపోఁగా మామిడి సింగన్న తన పినతండ్రి యనంతరమున వేమనృపాలునకు మంత్రి యయ్యెను. కుమారగిరిరెడ్డి రాజ్యకాలములోనే శ్రీనాధుఁడు మొట్టమొదట తన పండితారాధ్యచరిత్రమును ప్రెగ్గడన్న కంకితము చేసెను. ఈ విషయమును శ్రీ నాధుని గూర్చి మామిడి సింగన్న యన్న ట్లున్న నైషథములోని యీ క్రింది పద్యము వ్యక్షపఱచు చున్నది.

         క. జగము నుతింపఁగఁ జెప్పితి
            ప్రెగడయ్యకు నా యనుంగు పెద్దనకుఁ గృతుల్
            నిగమార్థసారసంగ్రహ
            మగు నా యారాధ్యచరిత మాదిగఁ బెక్కుల్.


దీనినిబట్టి చూడఁగా నొక్క యారాధ్యచరిత్రమునే గాక యితరపుస్తకములను గూడ మఱికొన్నిటిఁ బ్రెగడయ్య కంకితమొనర్చినట్టు కనుపట్టుచున్నది. శాలివాహనసప్తశతి గూడ నీతనికే యంకితము చేయఁబడినదేమో!

           "నూనూగుమీసాలనూత్నయౌవనమున
            శాలివాహన సప్తశతి నొడివితి"