పుట:Aandhrakavula-charitramu.pdf/501

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

474

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

కలిగి యుండును. పల్నాటివీరచరిత్రము ద్విపదకావ్యము. ఇది 1384 -వ సంవత్సరప్రాంతములయందు రచియింపబడి యుండును. పల్నాటివీరుల చరిత్రద్విపద నోరుగంటిపురములో నాడినట్లు 1420-వ సంవత్సరప్రాంతములందు వల్లభరాయనిచే రచియింపఁబడిన క్రీడాభిరామమునం దిట్లు చెప్పబడినది.

          గీ. ..........విప్రుఁ డీక్షించెఁ బలనాటి వీరపురుష
             పరమదైవతశివలింగభవనవాటి,


          మ. ద్రుతతాళంబున.............
              యతిగూడం ద్విపద ప్రబంధమున వీరానీకముం బాడె నొ
              క్కత ప్రత్యేకముగాఁ గుమారకులు ఫీట్కారంబునన్ దూలగన్.

          గీ. .............పడఁతి పల్నాటివీరులఁ బాడు నపుడు. [1]

[పల్నాటి వీరచరిత్రము ద్విపదకావ్యము. ప్రస్తుతము ప్రచారములోనున్నది మంజరీఛందమున నున్నది. ఇది యసమగ్రము. ఇది శ్రీనాధుని రచన కాదని కొందఱి మతము. ఆంధ్రకవి తరంగిణీకారులు నట్లే తలంచియున్నారు. కాని కొన్ని భాగములలో శ్రీనాథుని పోకడలు, కొన్నింట శ్రీనాధుని రచన యనఁదగిన రచన కానవచ్చుచున్నట్లు కొందఱు తలంచుచున్నారు. శ్రీనాధుఁడు, కొండయ్య, మల్లయ్య అనువారు వీరచరిత్ర గ్రంథకర్తలుగా దెలియవచ్చుచున్నారనియు, శ్రీనాధుని ద్విపదకావ్యమును జూచి మిగిలిన యిర్వురును గ్రంథరచనము చేసియుందురనియును శ్రీ, సి. పి. బ్రౌను దొర గారును, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు నభిప్రాయపడినారు.

మఱియు నియ్యది శ్రీనాథుని చిన్ననాఁటి రచనగా శ్రీ ప్రభాకరశాస్త్రిగారు తలఁపలేదు. రాణావలంబనము పోయినపిదప-అనఁగా-కొండవీటి పతనమునకుఁ దర్వాత శ్రీనాధుఁడు 'పల్నాటిప్రాంతములను బర్యటించునప్పడు,

  1. క్రీడాభిరామకర్తృత్వముఁగూర్చి వల్లభరాయని చరిత్రమున వివరింపఁబడినది.