పుట:Aandhrakavula-charitramu.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

472

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

               మ. కనకక్ష్మాధరధీరు వారిధితటీక్రాల్పట్టణాధీశ్వరున్
                   ఘనునిం బద్మపురాణసంగ్రహకళాకావ్య ప్రబంధాధిపున్
                   వినమత్కాకతిసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు నా
                   యనుఁగుందాతఁ బ్రదాత శ్రీ కమలనాభామాత్యచూడామణిన్.

ఈకాల్పట్టణ మేదో తెలియదు; ఆప్రాంతములయందుఁ బ్రసిద్ధికెక్కిన మోటుపల్లి యను రేవుపట్టణ ముండును గాని యది యిది కాదు. మోటుపల్లికి మొగడపల్లి యని నామాంతరము గలదు. శాసనములయందీ రేవుపట్టణము ముకుళపుర మని వాడబడినది. అనపోత రెడ్డికాలము నందలి యొక శాసనములోని యూ క్రింది శ్లోకములను జూడుఁడు -

              శ్లో. ఆహితతమః, కృశాను ర్వెమభూపాలసూనుః
                  స్తుతకలిత మహీశాన్నాన్నపోతక్షి తీశః
                  శాకాబ్దే గగనాష్టసూర్యగణితే తీరే మహాంభోనిధిః
                  ప్రఖ్యాత మ్ముకుళాహ్వయే పురవరే శ్రీసోమమంత్రీకరః

ఆందుచేత క్రాల్పట్టణము మోటుపల్లి గాక వేఱొకసముద్రతీర గ్రామమయి యుండును. ఇది యేదియో నిర్ధారణ మగువఱకును క్రాలనఁ గ్రొత్త యని యర్ధము చేయవచ్చును గనుకను, కడను పట్టణశబ్దమున్నది గనుకను క్రొ_త్తవట్టణమునుగా భావింతము, కమలనాభుఁడీ క్రాల్పణట్టమునకు కరణము. ("వినమత్కాకతిసార్వభౌము" నని పద్యములో నుండుటచేత నితఁడు బాల్యములో1320 -వ సంవత్సర ప్రాంతములయందు కాకతి