పుట:Aandhrakavula-charitramu.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

471

శ్రీనాథుఁడు

              డెఱ్ఱనార్యుఁడు సకలలోకైకవిదితుఁ
               డై న నన్నయభట్ట మహాకవీంద్రు
               సరససారస్వతాంశ ప్రశస్తి దన్నుఁ
               జెందుటయు సాధుజనహర్ష సిద్ధి గోరి.

            క. ధీరవిచారుఁడు తత్కవి
               తారీతియుఁ గొంత తోఁవఁ దద్రచనయకా
               నారణ్యపర్వశేషము
               పూరించెఁ గవీంద్రకర్ణపుటపేయముగాన్ .

ఈ యిద్దఱి పద్యములను బట్టి చూడఁగా గుంటూరు మండలములోని కొండ వీడు మొదలుకొని నెల్లూరిమండలములోని కందుకూరువఱకు నున్న దేశము పాఁకనాఁ డని తోచుచున్నది.

ఇతఁడు [1] పాకనాటిసీమలోని నెల్లూరిమండలమునందలి యొక సముద్రతీర గ్రామమునందు పుట్టి పెరిగినవాఁడు. ఈ పితామహుఁడు కమలనాభుఁడు మంచి పండితుఁడు; కవీశ్వరుఁడు; తెనుఁగునఁ బద్మపురాణ సంగ్రహమును జేసెనఁట ! ఈతని నివాసస్థానము సముద్రతీరమందలి [2]క్రాల్పట్టణమయినట్టు శ్రీనాధుడు భీముఖండములో నీ క్రింద పద్యమునందుఁ జెప్పి యున్నాఁడు.

  1. [పద్యములోని 'పాకనాఁటింటివాడవు'అను దానింబట్టి శ్రీనాథుcడు పాకనాఁటి సీమలోని వాఁడని చెప్పవలను పడదనియు, అతఁడు పాకనాఁటి శాఖకు జెందిన నియోగియ నుటలో నేయని ప్రమాణము కాఁగలదనియు, 'ఇంటివాcడవు' అనుటం బట్టియే యీ యంశము స్పష్టమగుచున్నదనియు గొందఱి యభిప్రాయము. చాల మంది పండిత విమర్శకులు దీనినే యామోదించుచున్నారు.]
  2. ['వారిధితటీ క్రాల్పట్టణాధీశ్వరున్' అనునెడ 'వారిధి తటీ కాల్పట్టణాధీశ్వరున్' అను పాఠాంతరము కలదు, దానినే పలువురంగీకరించిరి. ఈ కాల్పట్టణ మేమో యింతవఱకును సరిగా నిశ్చయింపఁ బడలేదు. క్రోత్త పట్టణము అనుటకు బదులుగా శ్రీనాథుఁడు 'క్రాల్పట్టణ మని చెప్పియుండడనియు, క్రొత్త కు "క్రాలు పర్యాయపదము కాదనియు జాలమంది యభిప్రాయపడుచున్నారు. కృష్ణా మండలమునందలి 'కాశీపట్టణ మే' "కాల్పట్టణమై యుండునని యభిప్రాయ పడిరి. ఈ కాల్పట్టణము కలపటమై యుండునని శ్రీ కొమఱ్ఱాజు వేంకట లక్మణ రావుగారి యభిప్రాయము. గుంటూరుజిల్లా, రేపల్లె తాలూకాలోనున్న నల్లూరే (నల్ల + ఊరు = "కాల పట్టణము. కాల్పట్టణము) శ్రీనాథుని నివాసమైనట్లాంధ్రకవి తరంగిణి కర్తల యాశయము. [చూ, ఐదవ సంపుటము ఫుట. 6.] నెల్లూరు శ్రీనాథుని నివాసము కానగునని శ్రీ నేలటూరి వేంకటరమణయ్యగారి యాశయము[ చూ. భారతి - ఆంగీరస - మాఘసంచిక]