Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

465

శ్రీనాథుఁడు

1410 వ సంవత్సరమునందు త్రవ్వింపఁగా దరువాత నామె కుమారుఁడు రాచవేముఁడు దానికి నీరు వచ్చుటకయి జగనొబ్బగండ నామము గల కాలువ నొకదానిని 1416- వ సంవత్సరమునందు త్రవ్వించెను. పెద కోమటివేమారెడ్డి 1420 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసి యిహలోకయాత్రను చాలించెను.


6. రాచ వేముఁడు

కోమటివేముని యనంతరమున నాత నిపుత్రుఁడు రాచవేముఁడు రాజ్యమునకు వచ్చి యేదో విధముగా రాజ్యపాలనము చేసి 1424 వ సంవత్సరము నందు దేహము త్యజించెను. ఇతఁడు దుష్పరిపాలనముచేత జనకంటకుఁ డయినందున నీతని భృత్యులలో నొకఁడీతనిని పొడిచి చంపె నని చెప్పుదురు. ఈతనితండ్రికాలములోనే కొండవీటిరాజ్యము దుర్బల మయినందున నీతఁడెట్లో నాలుగు సంవత్సరములు రాజ్యతంత్రము నతృప్తికరముగా నీడ్చుకొని రాఁగా తదనంతరమున రాజ్య మన్యాక్రాంతమయి తుదకు కర్ణాటులపాలయ్యెను. ఈతనితో కొండవీటిరాజ్యమంతరించెను. ఇఁక మనము రెడ్డిరాజ్యములలో రెండవది యగు రాజమహేంద్రవరరాజ్యము నకు వత్తము.

1.కాటయ వేముఁడు

కొటయవేమారెడ్డి యనపోతభూపాలుని యల్లుఁడు; కొమరగిరి రెడ్డి చెల్లెలయిన మల్లాంబికభర్త కుమారగిరిరెడ్డి తనకు మఱదిఁయు మంత్రియు నైన యీ కాటయవేమునికి 1386-వ సంవత్సరమునందు రాజమహేంద్రవరరాజ్యము నిచ్చిన ట్టీవఱకే చెప్పఁబడెను గదా ! ఇతఁ డప్పటినుండియు సమర్ధతతో ప్రజాపరిపాలము చేయుచు, కొమరగిరి రెడ్డి మరణానంతరమున 1400 -వ సంవత్సరప్రాంతమున కొండవీటి రాజ్యమునకు వచ్చిన కోమటి వేమారెడ్డి రాజమహేంద్రవర రాజ్యమపహరించుటకయి చేసిన కృషినంతను విఫలము చేసి, బహుయుద్దములందు తన దండనాధుడును ననవేమారెడ్డి