Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొండవీటిరాజ్యముకూడ నీతని పెత్తాత మనుమడైన పెద్దకోమటిరెడ్డి యధీన మయ్యెను. కొందఱు కొమరగిరిరెడ్డి కొక కొమారుడుగలఁ డనియు, ఉన్నను కోమటివేముఁడు కొండవీటిరాజ్యమును బలవంతముగా నక్రమముగా నాక్రమించుకొనెననియుc జెప్పుదురు.


5. పెదకోమటి వేముఁడు


కొమరగిరిరెడ్డి మరణానంతరమున 1400 వ సంవత్సరమునందు కోమటి వేమారెడ్డి కొండవీటిరాజ్యభారమును వహించినవాఁ డయి యంతటితోఁ దృప్తి నొంది యుండక రాజమహేంద్రవరరాజ్యమునుగూడ సంపాదింపవలె నని బహుసేనలతోఁ బలుమాఱు దండు వెడలి కాటయవేమారెడ్డితో ఘోర యుద్దములు చేసి విజయము నొందఁజాలక కాటయవేమారెడ్డిచేతను, నాతని దండనాధుఁ డయిన యల్లాడ రెడ్డిచేతను పరాభూతుఁడయి, భగ్నమనోరధుఁ డయి వెనుకకు మరలవలసినవాఁడయ్యెను. ఈ యుద్ధములవలన లాభమేమియుఁ గలగకపోవుటయే కాక బంధురాజు లైన కాటయవేమాదులతో బలవద్విరోధమును కొండవీటిరాజ్యమునకు దౌర్పల్యమును మాత్రము సంప్రాప్త మయ్యెను. కోమటివేముఁడు కొండవీటిరాజ్యమునకు వచ్చిన తరువాత శ్రీనాధునిఁ తన యాస్థానమునందు విద్యాధికారినిగా నియమించెను గాని, యతఁడేమియు రాజుపేర గ్రంథములు చేసినట్టు కనcబడదు. కోమటి వేముఁడు రచించినట్లు చెప్పఁబడెడి యమరుకవాఖ్యాన మైన శృంగారదీపికను శ్రీనాథుఁడే రచియించి దానికి రాజు పేరు పెట్టెనని చెప్పుదురు. [1] ఇది గాక యభినవభట్టబాణఁ డనఁబరఁగిన వామనభట్టు వీరనారాయణ చరిత్ర మను నామాంతరము గల వేమభూపాలచరిత్రమును సంస్కృతమున వచన కావ్యముగా రచించి దానిలోఁ గోమటివేమని సర్వజ్ఞచక్రవర్తినిగాను, వేమునిపూర్వులను గొప్పచక్రవర్తులనుగాను పొగడెను. ఈ కోమటి వేముని భార్య యైన సూరమాంబ సంతానసాగరమను తటాకమును

  1. దీని రచనలో నితఁడు శ్రీనాథుని సాహాయ్యమును పొందియుండవచ్చునని కొందఱి యాశయము.