Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

ఆంధ్ర కవుల చరిత్రము


Biographical sketches of Dekkan Poets' రచించిన శ్రీ కావలి వేంకటరామస్వామిగారు నన్నయ మరణము వలనఁ బూర్తికాక నిలిచిపోయిన అరణ్యపర్వము నాతని శిష్యుఁడగు బాలసరస్వతి పూరించెనని యభిప్రాయపడిరి. వారి మాటలను గమనింపుఁడు - “This poet also translated two Volumes of the Mahabharat into Telugu ın conjunction wıth Narain bhat, a bramin of the Indra sect but while employed in translating the third Volume, Nannaya unfortunately died, and as no other poet would undertake to complete the translation, a disciple of Nannaya Bhatt named Balasaraswati who was a fellow student, with Sarangadhara, the son of RajaRajanaraindra completed the work after intense labour and application" [Page 80]


ఇది విశ్వాసార్హము కాదు. రాజరాజునకు సారంగధరుఁడను పుత్రుఁడే లేనట్లును, చిత్రాంగి వృత్తాంతము కల్పితమైనట్లును చరిత్రకారులు నిర్ణయించి యున్నారు కాఁగా ఆతఁడు నన్నయభట్టునకు శిష్యుఁడై యుండుటయు పొసఁగదు. అప్పకవి తన గ్రంథమున "సిద్ధు డయిన సారంగధరుఁడు బాలసరస్వతి కాంధ్రశబ్దచింతామణి నొసగగా, ఆతఁడు దానికి టీకను వ్రాసె" నని చెప్పగా, శ్రీ వేంకటరామస్వామిగా రింకను ముందునకు సాగి, బాలసరస్వతి సారంగధరుని సహపాఠియనియు, తన గురువైన నన్నయభట్టు పూర్తి చేయక విడిచిన యరణ్యపర్వమును తెనిఁగించె ననియుఁ జెప్పుటలో వింతలలో వింత !

" కవి జీవితము " లను రచించిన శ్రీ గురజాడ శ్రీరామమూర్తిగారు అధర్వణునికిఁ దాను చేసిన ద్రోహమును దలంచి పశ్చాత్తప్తుఁడై విరాగిమై భారత ఆంధ్రీకరణమునకు వేరొకఱిని నియమింపఁగోరినట్లును, తిక్కనను ప్రార్ధింపఁగా-ఆతఁడు సమ్మతించి విరాటపర్వమునుండి ప్రారంభించి భారతము నాంధ్రీరించినట్లును-పిదప ఎఱ్ఱాప్రెగడ అరణ్యపర్వమును పూర్తి చేసినట్లును తెలిపియున్నారు.