పుట:Aandhrakavula-charitramu.pdf/487

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

460

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

ములోనిదే గాన శాసనములయందుఁ గాని పద్యములయందుఁ గాని యెక్కడ ననవేమునిఁ బేర్కొనవలసి వచ్చినను పూర్ణముగా ననవేమ యనిమే చెప్పుదురుగాని వేమ యని చెప్పరు. వేమయ లనేకులున్నచో భేదము తెలియుటకయి పోలయవేమ, కోమటివేమ, కాటయవేమ, అల్లయవేమ అని తండ్రి పేరితోఁ జేర్చికూడఁ జెప్పుదురు. ఈ రెండవ పద్యమునందుఁజెప్పఁ బడినవేమన కోమటివేమన యనుటకు సందేహము లేదు. ఆకాలమునందు రెడ్డిరాజులలో -వేఱు వేమనలు లేరు.

రెడ్డిరాజులలో అనవేమభూపాలుఁడు మిక్కిలి ప్రసిద్ధి చెందిన వాఁడు. ఈతఁడు చేసిన విశేషదానధర్మములచేతను పండితసమ్మానము చేతను నీతవి కీప్రసిద్ధి వచ్చినది. ఇతఁడు సంస్కృతాంధ్రములయందు, మంచి పాండిత్యము గల రసజ్ఞుడు. వెన్నెలకంటిసూరన చేసిన విష్ణువురాణములోని యీక్రిందిపద్య మీతని కీర్తి యెట్టిదో తెలుపుడుచేయును.

           క. తన బ్రతుకు భూమిసురులకుఁ
              దన బిరుదులు పంట వంశధరణీశులకున్
              దన నయము భూమి ప్రజలకు
              ననవేమన యిచ్చెఁ గీర్తి నధికుం డగుచున్
.
అనవేముఁడు తన రాజధానిని తనపూర్వులకు రాజధాని యయి యుండిన యద్దంకినుండి కొండవీటిదుర్గమునకు మార్చినట్టు పూర్వోదాహృతశాసనము లోని యీ శ్లోకములు తెలుపుచున్నవి.

          శ్లో. తతో౽న్న వేమనృపతిః పరిపాలనకర్మణి
              ఆపాలయ స్తస్య పుత్ర స్తదం తేంద్రవసుంధరా
              కొండవీడుం రాజధానిం సతిచిత్రా మకల్పయత్
             దృష్టొ త్వష్ణాపి చిత మభూ ద్యస్యా స్సవిస్మయః.

ఆనవేమమహీపాలునికి పుత్రసంతతి లేదు. ఒక్క కొమారితమాత్రముండెను. ఆమె భక్తినశ్వర చోళృపాలపుత్రుఁ డైన భీమనృపాలువకు భార్య