Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీనాథుఁడు

సహాయులయి యసహాయశూరులయి రాజతంత్రము నడుపుచుండఁగా పండ్రెండు సంవత్సరములు సత్పరిపాలనము చేసి సముద్రవ్యాపారమున కత్యంత ప్రోత్సాహము కలిగించి యనపోతభూపాలుఁడు స్వర్గస్తుఁడయ్యెను. కుమారగిరిరెడ్డి యీతనికుమారుఁడు; మల్లాంబ యీతని కొమారిత, యీ మల్లాంబిక యనపోతారెడ్డి మేనల్లుఁడయిన కాటయవేమారెడ్డికి భార్య యయ్యెను.

3.అనవేమారెడ్డి

అనపోతారెడ్డి యనంతరమున నాతని తమ్ముఁడుఅనవేమారెడ్డ రాజయ్యెను. అనపోతారెడ్డివలెనే యాతని పెదతండ్రికొడుకు పెదకోమటిరెడ్డి కూడ మఱికొంతకాలమునకు లోకాంతరగతు డయినందిన ననవేమారెడ్డ రాజ్యకాలములోనే యతనికొడుకు వేమన తండ్రిరాజ్యమునకు వచ్చెను. అనవేమారెడ్డికి మామిడి పెద్దనామాత్యుఁడుసు, వేమారెడ్డికి పెద్దనామాత్యుని తమ్ముఁడు నామామాత్యుఁడును మంత్రులయినట్టు శృంగారనైషధమునందీ క్రింది పద్యములలోఁ జెప్పఁబడినది.

          మ. అనతారాతివనుంధరారమణసప్తాంగోపహార క్రియా
              ఘనసంరంభవిజృంభమాణపటుదోః ఖర్జూద్వితీయార్జునుం
              డనవేమాధిప రాజ్యభారభరణవ్యాపారదక్షుండు పె
              ద్దనమంత్రీశుఁడు మామిడన్నసుతుఁ డేతన్మాత్రుఁడే చెప్పఁగన్

          శా. స్వామిద్రోహరగండలాంఛనునకున్ సంగ్రామ గాండీవికిన్
              వేమక్ష్మాపతికార్యభారకలనావిఖ్యాతధీశక్తికిన్
              నామామాత్యున కన్యరాజనిటలాంతర్న్యస్తభాగ్యాక్షర
              స్తోమాపాకరణ ప్రవీణునకు మంత్రు ల్సాటియే యెవ్వరున్?

ఇందు మొదటి పద్యమునం 'దన వేమ' యని యున్నది; రెండవ పద్యము నందు వేమ యని యున్నది. "అనవేమ" యన్న దంతయు నేకనామధేయ