పుట:Aandhrakavula-charitramu.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

458

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

                క. దానంబునఁ గర్ణునిసరి
                  మానంబున పేర్మి ననుపమానుఁడు బుధస
                  న్మానచతురుండు మాచయ
                  సూనుఁడు కోమటి సమస్తసులభుఁడు కరుణన్.

కోమటి పోలయ వేమునియొద్ద నాంధ్రకవిత్రయములోఁ గడపటివాఁడైన యెఱ్ఱాప్రెగడ యాస్థానకవీశ్వరుఁడుగా నుండి రామాయణమును, హరివంశమును నాతని కంకితముచేసెను. ప్రబంధపరమేశ్వరుఁడైన యెఱ్ఱాప్రెగడ హరివంశములోఁ గృతిపతియైన వేమారెడ్డి తల్లిదండ్రులను గూర్చి యిట్లు చెప్పెను.

              చ. కులజలరాశిచంద్రుఁడగు కోమటిపోలనయు న్నితంబినీ
                  తిలకము పుణ్యరాలు పతిదేవత యన్నమయుం గృతార్థతా
                  కలితులు ధీరు వేమవిభుఁ గానఁగఁ గాంచినపుణ్య మెద్ది యే
                  కొలఁదుల నెన్ని జన్మములఁ గూర్చిరొనాఁ బొదలున్ జనస్తుతుల్.

యీ పోలయవేమనృపాలుఁడు 1320 మొదలుకొని 1350 వ సంవత్సరము వఱకును రాజ్యపాలనము చేసి కాలధర్మము నొందెను. వేముని యనంతర మన సవతి పుత్రుఁడు అనపోతారెడ్డి 1350 వ సంవత్సరమునందు రెడ్డి సామ్రాజ్యభారమును వహించెను. ఈ ప్రకారముగానే మాచన బ్రభువు యొక్క మరణానంతరమున నాతని పుత్రుఁడు రెడ్డిపోతనర పాలుఁడును, తదనంతరమున పెద్దకోమటివేమారెడ్డియు తండ్రియొక్క చిన్నరాజ్యమునకు రాజు లయిరి.

అ న పో తా రెడ్డి

ఇతఁడు 1350 వ సంవత్సరము మొదలుకొని 1361 వ సంవత్సరము వఱకును రాజ్యపాలనము చేసెను. ఈతని తోడఁబుట్టిన పడతి చైన దొడ్డాంబికభర్త కాటయరెడ్డియు, ఆమె చెల్లెలు వేమాంబిక భర్త నూకయరెడ్డియు, మంత్రి దండనాయకు లయి తనకు మహా