21
న న్న య భ ట్టు
ఉ. ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో
నేది వచింపఁగాఁబడియె నెందును దానినె కాని సూత్రసం
పాదన లేమిచేఁ దెలుఁగు బల్కు మ ఱొక్కటి గూర్చి చెప్పఁగా
రా దని దాక్షవాటికవిరాక్షసుc డీనియమంబు చేసినన్.
క. ఆమూఁడుపర్వములలో
నామాన్యుఁడు నుడువుతెనుఁగు లరసికొని ? కృతుల్
తాము రచించిరి తిక్క
సు ధీమణి మొద లైన తొంటి తెలుcగుకవీంద్రుల్.
అని ఎఱ్ఱాప్రెగడ యారణ్యపర్వశేషమును రచించిన తరువాత నున్న యప్పకవి మొదలైనవారు సహితము మూఁడుపర్వము లని సామాన్యముగాcజెప్పుచున్నారే కాని మూఁడుపర్వములు పూర్తిగా నని చెప్పుట వారియద్దేశ మెంతమాత్రమును గాదు. పూర్వకాలమునుండియు లిఖింపఁబడుచు వచ్చిన భారత తాళపత్రపుస్తకము లన్నిcటిలోన "స్ఫురదరుణాంశురాగరుచి" యన్న పద్యమునకు ముందు " ఇక్కడనుండి ఎఱ్ఱాప్రెగడ కవిత్వము" అని వ్రాయC బడుచువచ్చుటచేత నన్నయ భట్టంతవఱకు మాత్రమే చేసె నని తెల్లమగుచున్నది. కలియుగాదిని భారతము తెనిఁగింపఁబడె నని కాకునూర్యప్పకవి వ్రాసి యున్నాఁడు, కాని యావ్రాఁత కాధారము లేవియుఁ గనcబడవు.
[ఆంధ్రభారతములోని యేయే భాగముల నెవ్వరెవ్వరు పూరించిరి ? అను విషయమున పలువురు రచయితలు విభిన్నములను, విచిత్రములు నగు నభిప్రాయములను వెల్లడించి యున్నారు. నన్నయభట్టు భారతములోని యాది, సభాపర్వములను, అరణ్యపర్వము లోని కొంతభాగమును తెలిఁగించెననియు. ఎత్థాపెగడ అరణ్యపర్వశేషమును పూర్తి చేసెననియు, తిక్కనసోమయాజి విరాటపర్వము మొదలు పదునైదుపర్వముల నాంధ్రీకరించి, భారతమును పూర్తిచేసెననియు సామాన్యముగ నందఱు నంగీకరించుచున్నారు. కవి కవుల చరిత్రములను రచించిన కొందఱు వేఱువిధముగఁ దలఁచుచున్నట్లు తెలియుచున్నది.