పుట:Aandhrakavula-charitramu.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

451

శ్రీ నా థుఁ డు

కొత్తపట్టణ మేర్పడి యింకను రెండువందల యేండ్లయినను కాలేదనియు శ్రీ ప్రభాకరశాస్త్రిగారు తెల్పియున్నారు. ఆయన మతమున మచిలీపట్టణమునకుఁ దూర్పున సముద్రతీరమునఁ గల కాశీపట్టణమే కాల్పట్టణము. ఆ గ్రామము ప్రాచీన ప్రాభవమును సూచించుచున్నదఁట ! శ్రీ కొమఱ్ఱాజు - వేంకటలక్ష్మణరావుగారు ఒక శాసనమునందు "కలుపట్టణము" అను పేరు చూచి శ్రీనాధుని కాల్పట్టణ మదియే యని నిర్ణయించిరి. ఆకలుపట్టణము నేఁడు కలపటమును పేర నున్నది. అదియు కాళీపట్టణపు దరిదాఁపుననే గలదcట! శ్రీనాథుఁడు పేర్కొనిన గ్రామమిదియైనను గావచ్చును. ఈ యంశములని శ్రీ ప్రభాకరశాస్త్రిగారి "శృంగార శ్రీనాధము" నఁ దెల్పఁబడినవి. శ్రీనాథుని నివాసము "నెల్లూ" రని నేలటూరి వేంకట రమణయ్యగారును, రేపల్లె తాలూకాలోని 'నల్లూ" రని శ్రీ చాగంటి. శేషయ్యగారును అభిప్రాయ పడుచున్నారు]

కమలనాభునిఁ గాక యీ కవి భీమఖండమునందు నన్నయభట్టారకుని, తిక్కనసోమయాజిని మాత్రమే యీ క్రింది పద్యములతో స్తుతించి యున్నాడు.

           క. నెట్టుకొని కొలుతు నన్నయ
              భట్టోపాధ్యాయసార్వభౌమునిఁ గవితా
              పట్టాభిషిక్తు భారత
              ఘట్టోల్లంఘనపటిష్ఠగాఢప్రతిభున్.

          మ. పంచమవేదమై వరఁగు భారతసంహిత యాంధ్రభాషఁ గా
              వించెఁ బదేనుపర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
              క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
              ర్వంచితకీర్తివైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్.

కవిత్రయములో నెఱ్ఱాప్రెగడ యప్పటి కాధునికుఁ డగుటచేత నాతని నీగ్రంథమునందుఁ బొగడకపోయినను తాను రచియించిన యితర గ్రంథములయం దీకవి యాతనిని పేర్కొన్నాడు.