447
వి ను కొం డ వ ల్ల భ రా యఁ డు
నందు రచియింపబడెనని నిరాక్షేపముగాఁ జెప్పవచ్చును. ఈ వల్లభరాయనికవిత్వము మృదుమధురపదగుంభనము కలదయి ప్రౌఢముగా నున్నది. కాని కొన్ని చోట్లఁ గ్రీడాభిరామములోని వర్ణనము లసభ్యము లయియశ్లీలములయి నీతిబాహ్యము లయి యుండుటచేత స్త్రీలును, సామాన్య జనులును జదువఁదగినది కాదు. జారత్వము దూష్యముగా బరిగణింపcబడక శ్లాఘ్యముగా నెంచcబడెడు కాలమునందుఁ జేయఁబడిన గ్రం థము విషయమయి మనము కాలమును నిందింపవలసినదే కొని కవివి గర్హింపవలసిన పనిలేదు. ఈ కవియే ప్రస్తావనయందుఁ దన తాతను నాతని తమ్ములను వర్షించుచు వారవధూజనపుష్పభల్లులని వారికి బ్రతిష్టావహమైన విశేషణము నీ క్రింది పద్యమునఁ గూర్చెను.
ఉ. మల్లనమంత్రికిం ద్రిపురమాతరళాక్షికిఁ గాంతి రోహిణీ
వల్లభు లాత్మసంభవులు వల్లభలింగనతిప్పనక్షమా
వల్లభమంత్రి శేఖరులు వారవధూజనపుష్పభల్లులు
త్ఫుల్లయశోవిభాసితులు పుణ్యులు సింగనభైరవేంద్రులున్.
ఇఁక నీ విషయము నింతటితోఁ జాలించి వినువారి వీనుల కింపుగా నుండు పద్యములను గొన్నిటిని గ్రీడాభిరామములోనివాని నుదాహరించుచు నీ చరితమును ముగించుచున్నాను.
గీ. జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందుఁ దెలుఁగు లెస్స;
జగతిఁ దల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె ?
మ. ద్రుతతాళంబున వీరగుంభితకధుంధుంధుం కిటాత్కారసం
గతి వాయింపుచు నాంతరాళికయతి గ్రామాభిరామంబుగా
యతిగూడం ద్విపద ప్రబంధమున వీరానీకముం బాడె నొ
క్కత [1]ప్రత్యేకముగాఁ గుమారకులు ఫీట్కారంబునం దూలఁగన్.
- ↑ [ప్రత్యక్షరమున్-అని సరియైన పాఠము.]