446
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
సీ. మూఁడు గ్రామ గాసములతోడఁ గూడంగ
మోపూరు పాలించె ముల్కినాట
నాశ్వలాయనశాఖయందు ఋగ్వేదంబు
కరతలామలకంబుగాఁ బఠించెఁ
బ్రత్యక్ష మొనరించి భైరవస్వామిచేఁ
సిద్ధసారస్వతశ్రీ వరించెఁ
గామకాయనసవిశ్వామిత్ర గోత్రంబు
వంశ గోత్రంబుగా వార్తకెక్కె
నెవ్వఁ డా త్రిపురాంతకాధీశ్వరునకు
రాయనవరత్న భండారరక్షకునకుఁ
బ్రియతనూజుండు చంద్రమాంబికకు సుతుఁడు
మనుజ మాత్రుండె వల్లభామాత్యవరుఁడు.
క. అహరవధిసమయనృత్య
త్తుహినాంశుధరప్రచారధూతాభ్రధునీ
లహరీ భ్రమఘుుమఘుమములు
వహిఁ దిప్పయవల్లభన్న వాగ్వైభవముల్.
శా. సారాచారమునన్ వివేకసరణిన్ సౌభాగ్యభాగ్యంబులన్
ధౌరంధర్యమునన్ బ్రతాపగరిమన్ దానంబునన్ సజ్జనా
ధారుం దిప్పనమంత్రి వల్లభు నమాత్యగ్రామణిం బోల్పఁగా
వేరీ మంత్రులు సింధువేష్టితమహోర్వీచక్రవాళంబునన్ ?
వల్లభరాయఁడు 1404 వ సంవత్సరమువఱకును కర్ణాటక రాజ్యపరిపాలనము చేసిన హరిహరరాయల రత్నభాండారాధ్యక్షుఁ డయిన తిప్పన పుత్రుఁడగుటచేత నా సంవత్సరమున కనంతరమున నుండె ననుటకు సందేహము లేదు. అందుచేత నీ క్రీడాభిరామము 1420 వ సంవత్సర ప్రాంతము