పుట:Aandhrakavula-charitramu.pdf/461

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

434

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

వఱకును మన మూహింతము. ఈ రాయని భాస్కరుఁడు వ్రాయుటకే కాక దానము చేయుటకును రిపులను ఖడ్గముతో వేయుటకును గూడఁ బ్రఖ్యాతి చెందినవాఁడు. [ఇయ్యెడ 'ఆంధ్రకవి తరంగిణి" లో నిట్లున్నది. "ఈ చాటువు (కలయఁబసిండి గంటమున-) నాధారముగాఁ గొని శ్రీ వీరేశలింగముపంతులు గారు తిప్పన చాటుధారలో వర్ణితుడైన రాయన భాస్కరుఁ డీఁతడే యని నిర్ణయించి త్రిపురాంతకుని కాలము క్రీ శ.1380 ప్రాంతమని నిర్ణయించినారు. ఈ పద్యములోఁ గలముఁ ప్రస్తావనయేగాని కత్తివర్ణనము లేదు. అందుచేఁ ద్రిపురాంతకుని భాస్కరు డీఁతడు కాడు. మఱియు క్రీ శ. 1380 వఱకును ఆనవేమారెడ్డియే రాజ్యమునందున్నవాఁడు. ఆకాలములోఁ గాటయ వేముని కధికార ప్రసక్తి లేదు. ఇతఁడు అనపోతారెడ్డి కల్లుఁడు. అతని కుమారుడైన కుమారగిరి రెడ్డి రాజ్యమునకు వచ్చిన 1382 వ సంవత్సరము నుండియును, కుమారగిరిరెడ్డి వలన రాజమహేంద్రవర రాజ్యమును బడసిన కీ. శ. 1386- వ సంవత్సరమునకుఁ బిమ్మటను కాటయవేమన కధికార ప్రాప్తి కలిగినది. ఆపిమ్మట, తిప్పయ యీభాస్కరుని నుతించినాఁ డందు మేని త్రిపురాంతకుఁడు దాదాపుగా శ్రీనాధుని కాలమువాడగును. సమకాలిక గ్రంధము నాతc డాంధ్రీకరించుటయు, నాతనిని బొగడుటయు సంభవింపదు ... .... ... ఎట్లయినను, త్రిపురాంతకుఁడు ద్వితీయ ప్రతాప రుద్రుని కాలమునందున్నవాఁడని తలంచుటయే యుచితమని నాయుద్దేశము" [ ఆంధ్రకవి తరంగిణి నాలుగవ సంపుటము, పుటలు 41, 42] రాయని భాస్కరునిఁ గూర్చి కవులు చెప్పిన పద్యము లనేకము లున్నను జదువువారికి మనోహరముగా నుండునని వానిలోనుండి కొన్నిటి నించు క్రిందఁ బొందు పఱుచుచున్నాను-

       క. చేకొని రాయని బాచఁడు
           కాకాలు గుణించినపిన్న కాలమునాఁడే
           లా కేత్వ మియ్యనేరఁడు
           దాకును గొ మ్మియ్యఁ, డిట్టి దాతలు గలరే.