Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

425

అ నం తా మా త్యుఁ డు

ర్థము లున్నందున మఱ్ఱిపూడి లేక మఱ్ఱివాడ లేక మోడుమూడి - అను గ్రామములలో నొకటియయి యుండవచ్చుననియు, మొత్తముపై నితఁడు కృష్ణామండల నివాసియనియు "ఆంధ్రకవి తరంగిణి" కారుల యాశయము.] ఈతనికవిత్వము రసవంతమై నిర్దుష్ట మయి మృదుపదకలితమయి హృదయరంజకముగా నున్నది.

ఈతఁడు రచియించిస గ్రంధములలో రసాభరణము, భోజరాజీయము, ప్రధానము లయినవి. రసాభరణము శృంగారాది రసాదులనుగూర్చి చెప్పఁబడిన లక్షణగ్రంధము. భోజరాజీయము వింతకధలను గలిగి చమత్కారముగా నుండును. ఈతఁడు భోజరాజీయమునం దెఱ్ఱాప్రెగడ వఱకును గల కవుల నీక్రింది పద్యముచేత స్తుతించి యున్నాఁడు.

 ఉ. నన్నయభట్టుఁ దిక్కకవినాయకు భాస్కరు రంగనాధుఁ బే
     రెన్నిక కెక్కినట్టి యమరేశ్వరు నెఱ్ఱనమంత్రి నాదిగాఁఁ
     జన్నకవీంద్రుల న్నవరసస్పుటవాణు లనంగ ధాత్రిలో
     నున్న కవీంద్రులం దలఁతు నుల్ల మెలర్పఁగ వాగ్విభూతికిన్.

అమరేశ్వరుని మహాకవినిగా ననేకులు పొగడి యున్నారు. కాని యాత డేకాలమునం దుండెనో, ఏ యే గ్రంథములను రచియించెనో, సరిగాఁ దెలియవచ్చినది కాదు. అమరేశ్వరకృతమైన విక్రమసేనములోని దని యొకానొక లక్షణగ్రంధమునం దొక పద్య ముదాహరింపబడియున్నది. ఇంకొక యుదాహరణ గ్రంథములో మఱికొన్ని పద్యము లుదాహరింపఁ బడినవి. అమరేశ్వరుని గ్రంధములవలెనే పూర్వకవుల గ్రంధము లనేకములు పేరు లేకుండ నశించి యుండును.

ఆంధ్రకవులలో ముగ్గురు నలుగురు మాత్రమే తమ కృతులలోఁ దా మున్న కాలమును వేసికొని యున్నారు. అట్టి కవులలో ననంతామాత్యుఁ డొకడు. ఈతఁడు రసాభరణమును శాలివాహనశకము 1356-వ సంవత్సరమునందనగా గ్రీస్తుశకము 1434-వ సంవత్సరమునందు రచియించినట్లా పుస్తకములోని యీ దిగువ పద్యముపలనఁ దెలియవచ్చుచున్నది.