పుట:Aandhrakavula-charitramu.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

424

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

ఈ కవి తామాఱుగురన్నదమ్ము లయినట్లీ క్రింది పద్యములలోఁ జెప్పుకొనెను.

            ఉ. భూనుతకీర్తి ముమ్మడివిభుండు మదగ్రజుఁ డేను వైష్ణవ
                ధ్యాన సమూహితాత్ముఁడ ననంతసమాఖ్యుడ నాదుతమ్ముల
                జ్ఞానవిదూరు లక్కనయు సత్కవి చిట్టనయున్ వివేక వి
                ద్యానిధి రామచంద్రుఁడు నుదారుఁడు లక్ష్మణనామధేయుఁడున్.

            క. ఈ యార్వురు నొక్కొక్కఁడు
                వేయిండ్లకు మొదలుగాcగ వెలయుదురని కా
                దే యాాఱువేలపే రిడి
                రీ యన్వయమునకు నేష్య మెఱిగిన పెద్దల్.

ఈ కవి శ్రీనాధునికాలమునం దున్నవాఁడో యాతనికంటెఁ గొంచెము పూర్వమునం దున్నవాఁడో యని తెలియవచ్చుచున్నది. [ఈతని 'రసాభరణము' చివఱఁగల "జానొందన్-" అనుపద్యమునుబట్టిహూణశకము 1435 జనవరి 25 తేదీని రసాభరణమును ధ్రువపట్టన కంకిత మిచ్చినట్లు తెలియు చున్నదనియు, అప్పటి కీతనికి 50 సంవత్సరముల వయస్సుండెనని తలంప వచ్చుననియు, అది నిజమైనచో ఇతఁడు శ్రీనాధునికంటెఁ గొంచెము చిన్న వాఁడై యుండి, ఆతని కాలమున గ్రంథరచన సాగించి యుండునని చెప్పటకు సంశయింప నక్కఱలేదనియు "ఆంధ్రకవి తరంగిణి' కర్తల యాశయమైనట్లు తెలియుచున్నది.[ చూ. అయిదవ సంపుటము పుట 260.]

'జానొందన్' అను పద్యములోఁ బేర్కొనబడిన 'ధ్రువపట్టణ' మేదియో తెలియకున్నది. ఇది గుంటూరు మండలములో కృష్ణానదీ పాంతమునఁ గల ధూళిపూఁడి యను గ్రామమా? యని యూహ పొడముచున్నదని రసాభరణ పీఠికలో శ్రీకోపల్లె శివకామేశ్వరరావుగారు తెల్పియున్నారు. ధ్రువపురి కృష్ణా మండలములోని దరువూరని ఛందోదర్పణ పీఠికలో శ్రీనిడదవోలు వెంకట రావుగారు తెల్పియున్నారు. ధ్రువశబ్దము నకు "మఱ్ఱి మోడు" అను రెండ