పుట:Aandhrakavula-charitramu.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

417

జక్కయ కవి

రము వఱకును రాజ్యపరిపాలనము చేసిన దేవరాయని కాలములో నుండెను. తాతకును మనుమనికిని నన్నూట యేబది సంవత్సరములు వ్యత్యాస ముండుట సంభవింపనేరదు గావున నిచ్చట మనుమఁడనగా సంతతివాఁడని యర్ధము చెప్పవలెను. ఆందుచేత సిద్ధనమంత్రి సూరన సోమయాజికి మనుమడు గాక తద్వంశజుఁడయి యుండుట నిశ్చయము.

ఇచ్చట "ఆంధ్రకవితరంగిణి' యందిట్లున్నది.

[వెలనాటి చోడులలో రాజేందచోడ నామధారులు పలువురున్నారు. ఇందు గడపటి యాతడు కులోత్తుంగ రాజేంద్రచోడుడు. ఇతడును మనుమసిద్ధియు సమకాలికులు. ఆతcడే సూరన సోమయాజి కగ్రహారమొసగెనని తలంచితి మేని సూరనసోమయాజి క్రీ. శ.1280 ప్రాంతమున నాతనిచే నగ్రహార మందెననియు నాతని, మునిమనుమడై న జన్నమంత్రి క్రీ.శ.1380 ప్రాంతము నందుండెననియు నిశ్చయింపవచ్చును. ఇందు విరుద్దమేమియు నుండదు. పంతులుగారు చూపిన వ్యత్యాసమునకు దావుండదు. మనుమఁడని వ్రాసిన దానిని వంశీయుడని దలంచ నక్కరయుండదు. (ఆంధ్రకవి తరంగిణి-నాల్గవసంపుటము -పుటలు 219-220)

కృష్ణా ! దేవకీనందనా ! అను మకుటము గల శతకమునకు గర్త సిద్దమంత్రి తండ్రి జన్నయయేయని పలువురి యభిప్రాయము. సిద్దమంత్రి తన వంంశీయుఁడని వెన్నెలకంటి వేంకటాచలకవి కృష్ణ విలాసమున జెప్పి యుండుటచే జన్నయ యింటి పేరును వెన్నెలకంటివారని నిర్ణయింప వచ్చునఁట ! ఇతని కాలము క్రీ. శ. 1360-1420 నడుమనుండవచ్చునట! పయి శతకము తిక్కన సోమయాజి కృతమనునొక ప్రతీతి యున్నది. కాని యది సత్య దూరమని పలువురి యభిప్రాయము.]

జన్నమంత్రియు సిద్ధనమంత్రియు గూడ దేవరాయమహారాజు వద్దమంత్రులుగా నున్నట్లు విక్రమార్కచరిత్రములోని యీ క్రింది పద్యములలోఁ జెప్పఁబడి యున్నది.