416
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
విక్రమార్క చరిత్రమును గృతి నందిన సిద్దన్న జన్నమంత్రి పుత్రుడయినట్టును, జన్నమంత్రి మంత్రిభాస్కరుని తమ్ముఁడయినట్టును; కృతిపతి యొక్క వంశాభి వర్ణనమునందుఁ జెప్పబడి యున్నది. ఈ వంశాభివర్ణనములోనే సూరనసోమయాజి రాజేంద్రచోడునిచే నెద్దనపూడి గ్రామము నగ్రహారముగాఁ బడసినట్టును, సిద్దనమంత్రి యాతని మనుమడైఁనట్టును ఈ క్రిందిపద్యములలోఁ జెప్పఁ బడినది.
సీ. వేదశాస్త్ర పురాణ విజ్ఞానసరణీమై
నధిగత పరమార్ధుడై తనర్చె
నెద్దనపూడి రాజేంద్ర చోడక్షమా
రమణుచే నగ్రహారముగఁ బడసెఁ
గనకదండాందోళి కాచ్చత్ర చామర
ప్రముఖ సామ్రాజ్య చిహ్నముల నొప్పె
సర్వతోముఖముఖ్య సవనక్రియా ప్రౌఢి
నుభయ వంశంబుల నుద్ధరించె
నన్నదానాది దానవిద్యా ఘనుండు
పరమ శైవ సదాచార పారగుండు
హరితవంశాంబునిధి చంద్రుఁ డార్యనుతుఁడు
సుగుణవిభ్రాజి సూరనసోమయాజి.
క. అమ్మహితాత్ముని మనుమఁడు
సమ్మాన దయానిధాన సౌజన్యరమా
సమ్మోదిత బాంధవుఁడై
యిమ్మహిలో సిద్దమంత్రి యెన్నిక కెక్కెన్.
రాజేంద్రచోడుడు 1156-వ సంవత్సరము మొదలుకొని 1163-వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను. సిద్దమంత్రి కొడుకైన జన్నయమంత్రి 1406 వ సంవత్సరము మొదలుకొని 1422-వ సంవత్స