పుట:Aandhrakavula-charitramu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17

న న్న య భ ట్టు

 
ప. య స్సంస్కృతకర్ణాటప్రాకృత పైశాచికాంధ్రభాషాసు
     కవిరాజశేఖర ఇతి ప్రథిత స్పుకవిత్వ విభవేన

 ప కవీ న్మనీషాలవదుర్విదగ్ధాన్ మనోహరాభి ర్నిజసూక్తిభి ర్యః
    కుర్వన్న గర్వా న్పటుభి ర్విభర్తి కవీభవజ్రాంకుశనామసార్ధమ్

 గ. తస్మై సకలజగదభినుతగుణశాలినే సరస్వతీకర్ణావతంసా యాష్టా
    దశావధారణచక్రవర్తి నేనన్ని నారాయణాయ భవద్విషయే నందమ
    పూణ్డినామగ్రామోగ్రహారీకృత్య సోమగ్రహణనిమిత్తే ధారాపూ
    ర్వక మస్మాభి స్సర్వకరపరిహారేణ దత్త మితి విదిత మన్తు వః *[1]

ఇతఁడు సుకవిత్వవిభవముచేత సంస్కృతకర్ణాటప్రాకృత పైశాచికాంధ్ర భాషాకవిశేఖరుఁ డనియు, మనీషాలవదుర్విదగ్ధు లయిన కవులను మనోహరము లైన నిజసూక్తులచేత గర్వభంగము నొందినవారినిగాఁ జేసి కవీభవజ్రాంకుశ బిరుదమును సార్ధకము చేసికొన్నవాఁ డనియు, అష్టాదశావధానచక్రవర్తి యనియు, పయి వాక్యములు తెలుపుచున్నవి ఇతఁడు హారీతగోత్రుఁడును ఆపస్తంబసూత్రుఁడును పురోడాశపవిత్రవక్త్రుడుఁను నగు కాంచనసోమయాజి ప్రపౌత్రుఁడును, కందనార్యుని పౌత్రుఁడును శౌచాంజనేయసామికాంబలపుత్రుఁడును, అయినట్టు పై శాసనమే చెప్పచున్నది. ఈ నారాయణభట్టాంధ్రసంస్కృతముల యందుమాత్రమేకాక కన్నడమునందును మహాకవి యయి యుండెను. చాళుక్యులు కర్ణాట దేశమునకును వేఁగిదేశమునకునుగూడ పరిపాలకులయి యుండుటచేత రాజాస్థానముల యందుండిన యాకాలపు విద్వాంసులు సాధారణముగా కర్ణాటాంధ్రభాషా పండితు లయి కన్నడము నందును తెనుఁగు నందును గవిత్వము చెప్పగలవా రయి యుండిరి. కర్ణాటక భాషయంది. సుప్రసిద్దకవియైన నాగ వర్మ తన ఛందోంబుధిలోఁ దన జన్మ స్థలము వేఁగిదేశమని చెప్పకొనెను. బహుభాషల

  1. * ఈ శాసనము శాలివాహన శకము 976 న చంద్రగ్రహణమునాఁడు - అనఁగా క్రీ.శ. 1053 నవంబరు 3వ తేదిని వ్రాయcబడినట్లు తేలుచున్నదని ఆంధ్రకవి తరంగిణి? యందుc గలదు [చూ. పుట 106]