ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీగిరి కవి
ఈతఁడు "నవనాథ చరిత్రము"ను పద్యకావ్యముగా రచించినట్లు గౌరన రచించిన ద్విపద నవనాధ చరిత్రమువలనఁ దెలియవచ్చు చున్నది. ఆ పద్యకావ్యము కాని, యితని గ్రంథాంతర మగు శ్రీరంగ మాహాత్మ్యముగాని లభింపలేదు. ఈ కవి గౌరన కంటె బ్రాచీనుఁ డగుటచే క్రీ. శ.1301-1400 నడుమనుండి యుండవలెను. ఇతఁడు 'శ్రీగిరీశ ' అను మకుటముతో నొక శతకమునుగూడ రచించెనని చెప్పదురు శ్రీరంగమాహాత్మ్యము చెన్నమల్లు శ్రీగిరన్న కృతియని సంకలన గ్రంధమును బట్టి తెలియు చున్నది.
ప్రకాశ భారతయోగి
ఇతఁ డన వేమారెడ్డి యాస్థానమున నుండి పెక్కు సంస్కృతాంధ్ర గ్రంథములను రచించెనఁట! అదేదియు నిపుడు లభ్యమకాదు. ఇతఁడు రచించిన సీసపద్యములు రెండు భీమేశ్వరాలయము ( దాక్షారామము ) లోని శాసనములలో నున్నవట ! వానిని 'ఆంధ్ర కవితరంగిణి"కారు లిచ్చి యున్నారు (నాలుగవ సంపుటము - పుటలు 15గ8. 159)