Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భవదూరుఁడు

ఇతని పూర్తి పేరు భాస్కరభవదూర మహీపతియcట! సంగమ వంశీయుఁడును, విజయనగర పరిపాలకుఁడు అగు మొదటి బుక్కరాయల కుమారుఁడు. ఇతఁడు పోరుమామిళ్ళ తటాకమును త్రవ్వించెనఁట! ఇతని పద్యములు కొన్ని కానవచ్చుచున్నవి. గ్రంథములు కానవచ్చుట లేదు. ప్రాచీనులలోఁ గొుదఱు కపులీతనిని స్తుతించి యున్నారు. ఈయంశములను శ్రీనిడదవోలు వేంకటరావుగారు తెల్పుచున్నారు.

మొదటి బుక్కరాయల కుమారులలో భాస్కరుడాఱవ వాఁడు; అతఁడే యీకవి యైనచో నితనికాలము క్రీ.శ.1343 - 1379 నడుమఅయియుండును.