380 సంవత్సరప్రాంతమున నుండును;1380 వ సంవత్సర ప్రాంతమునం దుండిన యయ్యలు మంత్రితల్లి చిట్టాంబిక 1340 వ సంవత్సర ప్రాంతమందుండును; చిట్టాంబిక తండ్రి కొమ్మన 1300-వ సంవత్సర ప్రాంతమందుండును; కొమ్మన జనకుఁడు తిక్కన సోమయాజి 1260 వ సంవత్సర ప్రాంతములం దుండును. తండ్రి యైన యయ్యలుమంత్రి ని మంత్రిగాఁ గై కొన్న తొయ్యేటి యనపోత భూపాలుఁడు 1260-వ సంవత్సరము మొదలుకొని 1325-వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెనట! ఇవి శకసంవత్సరము లేమో. సింగకవి పద్మపురాణమునందీక్రింది పద్యముచేత నన్నయ్యతిక్కనలను మాత్రమే స్తుతించి యున్నాఁడు
ఉ. భారత వేదవాక్యరసభావము లజ్ఞు రెఱుంగ లేక
నిస్సారమనస్కులై తిరుగుచందముఁ జూచి తెనుంగుబాసఁ బెం
పార రచించి యందఱ గృతార్థులఁ జేసిన పుణ్యమూర్తులన్
సారమతి న్భజింతు ననిశంబును నన్నయ తిక్కనార్యులన్
ఈ కవి భాగవతదశమస్కంధమును, పద్మపురాణోత్తరభాగమును, వాసిష్ఠ రామాయణమును, తెనిఁగించెను. నన్నయాదులకవనమందువలెనే దీర్ఘ సమాసములు లేక యీతని కవిత్వము సలక్షణ మైనదిగా నున్నది.
క. ఆ పరమేశ్వరమకుట
వ్యాపితగంగా ప్రవాహవరకవితాస
ల్లాపుఁడగు మడికి సింగనఁ
జేపట్టక కీర్తి గలదె శ్రీమంతునకున్
అను పద్మపురాణములోని పద్యమువలనను,
చ. కదిసిన నోరవోవుచును గబ్బవుదొంతుల సత్పదార్థముల్
కదుకుచు నెట్టివారిఁ బొడగన్నను గుఱ్ఱని స్నేహసౌఖ్యముల్
మదికి ససహ్యమౌ శునకమార్గమునం జరియించు నోయస
త్పదకవులార! మత్కవితc దప్పులు పట్టక యూరకుండుడీ.