Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

400

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

                   నేపారు రాజమహేంద్ర పురికి
          నధిపతి తొయ్యేటి యనపోతభూపాలు[1]
                   మంత్రియై రాజ్యసంపదలఁ బొదలి
          యొప్పారు గౌతమియుత్తర తటమున
                   మహనీయ మగు పెద్దమడికి యందు

          స్థిరతరారామతతులు సుక్షేత్రములును
          బెక్కు లార్జించి సితకీర్తిఁ బెంపు మిగిలి
          యఖిల జగదన్నదాత నా నవనిఁ బరఁగె
          మధురగుణధుర్యుఁ డయ్యలమంత్రివరుఁడు.

      చ. ఒనరఁగఁ దద్వధూవరు లహోబల దేవునిఁ గొల్చి తద్వరం
          బున నొగి సింగనార్యుని నమోఘ గుణాఢ్యు ననంతుని న్మహీ
          జననుతు నబ్పయాంకు బుధసన్నుతిపాత్రువి నారయాహ్వయున్
          గని నరసింహనామములు గారవ మారఁగఁ బెట్టి రందఱున్.

       క. వారలలో నగ్రజుఁడను
          వారిజదళనయనచరణవారిజసేవా
          సారమతి నతులవాక్య
          శ్రీరచనా చతురమతిని సింగాహ్వయుఁడన్

పై పద్యములవలన నీ కవి తిక్కనసోమయాజుల మనుమరాలి మనుమఁ డగుటయే కాక గోదావరిమండలములోని పెద్దమడికినివాసుఁడని కూడ స్పష్టమగుచున్నది. ఈ కవి తన పద్మపురాణమునకుఁ గృతినాయకునిగాఁ జేసిన కందనమంత్రి కాకతీయ గణపతికాలములో నున్న గన్నయమంత్రి మనమని మనునుఁ దౌట కూడ కవికాలమును నిర్ణయించుట కనుకూల పడుచున్నది. గన్నయమంత్రి పుత్రుఁడు మల్లన్న. మల్లన్నపుత్రుఁడు

  1. [ఈ అనపోత భూపాలుఁడు కొంతకాల వెూరుగల్లు రాజ్యమును పాలించిన కాపయ నాయకునికిఁ చిన తండ్రి కుమారుఁడఁట. గోదావరినది కుత్తరమున నున్న గోదావరి మండల ప్రదేశమును పాలించుటకై శాపయనాయకుఁడీతనిని నియమించెనఁట. వీరు క్రీ.శ. 1370 వఱకును జీవించియున్నట్టు తెలియుచున్నదట.]