ఈ పుట ఆమోదించబడ్డది
398
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
భీమకవి గ్రంథములనుగూర్చి ప్రస్తావించుచు "తెనుగు కవుల చరిత్ర" లో "ఈతని కృతులలో రామగోపాలచరితమను ద్వ్యర్థికావ్యము నేఁడును మఱిియొక కవికృతిగా లభ్యమగు చున్నది" అని చెప్పబడినది. [పుట 288]
హరవిలాసము” భీమన కృతియైనట్లు తెల్పుచు కస్తూరి రంగకవి తన "ఆనందరంగడాట్ఛం దము' ననొక పద్యము నుదాహరించి యున్నాడు. ఈ భీమన వేములవాడ భీమకవి యని చెప్పటకుఁ దగిన యాధారములు లేవు.
"భీమన ఛందము" లోనివని రంగరాట్ఛందమున రెండు పద్యము లీయబడినవి. అవి కవి జనాశ్రయములోఁ గానరాకున్నవి. ఛందస్సును రచించిన భీమన యొకఁడుండెనెమో?]