పుట:Aandhrakavula-charitramu.pdf/424

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

397

వే ము ల వా డ భీ మ క వి

           ట్పదియెనిపాల్కురికె సోమేశ్వరనకారుణ్య
            ఒదవిదఖిళా ప్రపూరిత
            హృదయ భీమకవి ప్రణీతా
            భ్యుదయ బసవపురాణకథెయొళు అష్టమాశ్వాస.

[భీమకవి కన్నడ బసవపురాణమును గురించి " ఆంధ్రకవితరంగిణి" లో నిట్లు వ్రాయఁబడినది "కన్నడ బసవపురాణకర్త వేములవాడ భీమకవి యని నిస్సంశయముగాఁ జెప్పుటకు వీలు లేదని తోచుచున్నది, గ్రంథాదిని గ్రంథాంతమునను భీమకవి యని మాత్రమే చెప్పబడినది. వేములవాడ భిమకవి యని యెచ్చటను జెప్పియుండలేదు. ఈ కవి తండ్రి శివకవి దేవుఁడు.........కన్నడ బసవపురాణ కర్త తండ్రి శివ దేవుఁడని చెప్పినచో, ఈ కధకుఁ గొంత సరిపోయి యుండును. మధ్యఁకవి శబ్దము నుపయోగించి యుండుటచే నీభీమకవి తండ్రి కవిత్వముఁ జెప్పఁగలవాఁడయి యుండినట్లుతోఁచుచున్నది.

'పై పద్యమును (విరచించెజైమిని-అను పద్యమును) పిడుపర్తి సోమనాధ కవి, భీమకవి భాషాంతరీకరణమును సమర్ధించుటకై వ్రాసినాడనుట కంటె తన గ్రంధమునందు పాల్కురికి సోమనాధుని మూలకావ్యము నందలి వాక్యములు వచ్చిపడినను, చదువరులు తనయందు గ్రంథచౌర్యము నారోపింపకుండుటకై వ్రాసియుండెనని భావించుట సమంజస మని నాయభిప్రాయము. [పుట 224. అధస్సూచిక]

'శ్రీ వీరేశలింగము పంతులుగారు, వేములవాడ భీమకవిని, కన్నడ బసవపురాణకృతి కర్తయగు భీమకవిగా నిరూపించుట యాధారరహితమై యున్నది.' అని "తెనుఁగు కవుల చరిత్ర" లో గలదు.