395
వే ము ల వా డ భీ మ క వి
భీమకవి పాల్కురికి సోమనాధ కవికృతమైన ద్విపద తెనుగుబసవపురాణమును గర్ణాటకభాషలో భామినీషట్పది పద్యములలో నెనిమిదాశ్వాసముల మహాకావ్యమునుగాఁ జేసెను. ఈ కవి యారాధ్య బ్రాహ్మణcడనియు, బసవపురాణము భీమకవీశ్వరరగడ యను పుస్తకములను రచించె ననియు ఈతనిని సుమారు 1385 వ సంవత్సరప్రాతమునందున్న పద్మణాంకుడు, 1585 వ సంవత్సరప్రాంతమునందున్న విరూపాక్షపండితుఁడు మొదలైన వీరశైవకవులు నుతించియుండిరనియు, కర్ణాటకకవిచరితము చెప్పుచున్నది, ఆరాధ్యబ్రాహ్మణు లాంధ్రులలో తప్ప నితరులలో లేరు. భీమకవి తాను శివకవిదేవపుత్రుఁడ ననియు, ఉభయ కవిత్వసమర్ధుఁడననియు, బసవపురాణములో నీ క్రిందిపద్యమునఁ జెప్పుకొనియున్నాఁడు.
"విమల సద్గురుసేవెయలి జం!
గమభజనెయలి లింగనిష్ఠా
సమతెయలి తనుమనధనంగళ నిత్తభవభక్తి ||
సమయవార్డి వివర్ధనోళ్వజ
హిమగు శివకవి దేవనాత్మజ
సుమతి భీమ నుభయ కవిత్వసమర్థను సురువడె"
భీమకవి తన బసవపురాణము శాలివాహనశకము 1291 కి సరియైన సౌమ్యసంవత్సర శ్రావణబహుళ దశమీ గురువారము ముగించితి నని పుస్తకాంతమున నీ క్రిందిపద్యములోఁ జెప్పికొనెను.
కోవిదరు కేళొళ్ళి తెన లుడు
దేవనిధినయనేందు [1] సంఖెగ
ళోవి శకవరుషం గళాగలు సౌమ్య వత్సరద
శ్రావణ బహుళపక్షదశమీ
- ↑ [ఉడుమ దేవ (చంద్ర) = 1; నిధి = 9, నయన=12; ఇందు=1; అనcగా "అంకానాం వామతో గతి" యను న్యాయమును బట్టి 1291.]