Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

394

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యెడలఁ దాను మరల బసవపురాణమునే పద్యకావ్యమునుగా రచింపవలసిన యావశ్యక మేమి వచ్చినది? ఏమియు రాలేదు, మహాకవియైన భీమన కంటెఁ దానెక్కువ ప్రౌఢముగాను మనోహరముగాను రచియింపఁగలుగుదు నన్న నమ్మకముచేతనా? కాదు. అందుచేత భీమకవి బసవపురాణమును పద్యకావ్యమునుగాఁ రచించినది తెలుఁగుభాషలోc గాదనియు, వేఱొకభాషలో ననియు నిందువలనఁ దేలుచున్నది. కవి శ్రీనాథుఁ డారాధ్యచరిత్రమును పద్యకావ్యముగాఁ జేసెనని చెప్పి దాని క్రిందనే సందర్భమంతగా కనcబడని నైషధభాషాంతరీకరణకథనము నుగ్గడించుట భీమకవిది భాషాంతర మనియు, నైషధమునందు వలెనే ప్రతిభాషాంతరీకృత గ్రంథమునందును మూలగ్రంథవాక్యములు కొన్ని పడుట యనివార్య మనియు చూపుటకొఱకయి యున్నది. ఆ కాలమునందు భీమకవి తన భాషాంతర మునందు మూలగ్రంథవాక్యములనే కొన్నిటిని బెట్టెనని జనులు నిందిం చుటవలన నిట్లు వ్రాయవలసి వచ్చియుండును. భీమకవిది భాషాంతరమైనచో నది యే భాష వైష్ణవమత గ్రంథములు సాధారణముగా నఱవములో నుండునట్లే శైవమతగ్రంథములు కన్నడములో నుండును గానఁ గర్ణాటక భాష యని వేఱుగఁ జెప్ప వలసిన పని లేదు. ఆ కాలమునందలి తెలుఁగు పండితుల కందరికికి సంస్కృత కర్ణాటకభాషలు సాధారణముగా వచ్చుచుండును. అందుచేత తెనుఁగును సహితము కర్ణాటకమనుచుండుట యప్పు డప్పుడు కలదు, శ్రీనాథుఁడు భీమఖండములో నేమనెనో చూడుడు.

      తే. "ప్రౌఢి బరికింప సంస్కృతభాష యండ్రు
           పలుకునుడికారమున నాంధ్రభాష యందు
           రెవ్వ రేమన్న నండ్రుగా కేలకొఱత
           నాకవిత్వంబు నిజము కర్ణాటభాష[1]

  1. [తనది కర్ణాటభాషయని యనుట యితరుల నాక్షేపించుటకై మాత్రమని యనుకొనవలెను. తనది కర్ణాట భాష యనుటకుఁ గాదు, లేదా విననింపైన భాష యని యైనను దాని కర్థము చెప్పవచ్చును.]