Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

393

వే ము ల వా డ భీ మ క వి

వఱకును నేను విశ్వసింపఁజాలను. నేను చూచినంతవఱకు భీమకవివిరచిత కృతినిగూర్చి నాకొక్క యాధారము కనcబడుచున్నది. కృష్ణదేవరాయనికిఁ గొంచెము ముందున్నవాఁడయి 1510 వ సంవత్సరప్రాంతమునందు బసవ పురాణమును పద్యకావ్యమునుగా రచించిన పిడుప ర్తి సోమనాథకవి భీమకవి బసవపురాణమును రచియించె నని తన గ్రంధముయొక్క- ప్రథమాశ్వాసములో నీ క్రిందిపద్యమునందుఁ జెప్పియున్నాఁడు.

         సీ. విరచించె జైమిని వేదపాద స్తవం
                          బొకపాదమునను వేదో క్తి నిలిపి
            హరభక్తి వైదికం బని శ్రుతు లిడి చెప్పెఁ
                          ప్రతిభ సోమేశుఁ డారాధ్యచరిత
            సరవి శ్రీనాధుఁ డా చరిత పద్యప్రబం
                          ధము చేసె ద్విపదలు తఱచు నిలిపి
            యాతండు పద్యకావ్యము చేసె నైషధ
                          మంచితహర్షవాక్యములఁ బెట్టి

            సోమగురువాక్యములఁ బెట్టి భీమసుకవి
            గరిమ బసవపురాణంబు గణనఁ జేసె
            గానఁ బూర్వకావ్యము వేఱుగతి రచించు
            వారి కాది కావ్యోక్తులు వచ్చి నెగడు.

ఈ కవి శ్రీనాధునికిఁ దరువాత నేఁబది యఱువది సంవత్సరములకే యున్న వాc డగుటచేత నాకాలపు సంగతులను చక్కఁగా నెఱిఁగినవాఁడు. పాల్కురికి సోమనారాధ్యుఁడు తెలుఁగున రచించిన ద్విపదకావ్యముల రెంటిలో పండితారాధ్యచరితము నక్కడక్కడ ద్విపద లుంచుచు శ్రీనాధుఁడు పద్యకావ్యమునుగాఁ జేసె ననియు, బసవపురాణమును భీమకవి పద్యకావ్యమునుగాc జేసె ననియు కవి చెప్పుచున్నాడు. తనకుఁ బూర్వ మునందే భీమకవి బసవపురాణమును పద్యకావ్యమునుగాఁ జేసి యుండిన